దాద్రానగర్ హవేలీ ఎంపీ మోహన్ దేల్కర్ (58) సోమవారం ఓ హోటల్ లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. సౌత్ ముంబైలోని ఓ హోటల్ రూమ్ లో ఆయన మృతదేహం లభ్యమైంది. అయితే ఆయన ఆత్మహత్య చేసుకొని ఉంటారని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ , ఇంకా అధికారికంగా ధ్రువీకరించలేదు.
ఆయన మృత దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తమై పోలీసులు ఆస్పత్రికి తరలించారు. గుజరాతీ భాషలో ఉన్న సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును తాము దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు ప్రకటించారు. దాద్రానగర్ హవేలీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన మోహన్ 2019లో ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు.
1986 నుండి మోహన్ డెల్కర్ కీలక పదవుల్లో ఉన్నారు. 1986-89 వరకు, దాద్రా నగర్ హవేలీ నుండి యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. డెల్కర్ 1989లో 9వ లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1990-91 కాలంలో అతను సబార్డినేట్ చట్టంపై కమిటీలో సభ్యుడయ్యాడు. తరువాత షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల సంక్షేమంపై కమిటీలో చేర్చారు. అతని వాణిజ్య, పర్యాటక మంత్రిత్వ శాఖల సంప్రదింపుల కమిటీలో సభ్యుడయ్యాడు. లోక్ సభకు 1991లో రెండవసారి. ఆ తరువాత 1996లో మూడవసారి తిరిగి ఎంపీగా ఎన్నికయ్యారు.