తెలంగాణ రాష్ర్టంలో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకు పెరిగిపోతుంది. లాక్ డౌన్ ఉన్నంతకాలం అంతగా లేని కేసులు ఒక్కసారిగా వందల నుంచి వేలకు చేరుకున్నాయి. ఇక కరోనా విషయంలో మొదటి నుంచి నిర్లక్ష్యంగా వ్యవహరించిన కేసీఆర్ సర్కార్ కి చివరికి హైకోర్టు మొట్టికాయలు వేసినా ఇసుమెత్తు కూడా మార్పురాలేదు. కరోనా సోకిన రోగుల పట్ల ప్రభుత్వ డాక్టర్లు, సిబ్బంది ఎలా వ్యవహరిస్తున్నారో? ఇద్దరు రోగులు మరణించే ముందు చెప్పిన మాటలు ఇప్పుడు తెలంగాణ ప్రజలు సహా అక్కడ నివసించే వారందర్నీ భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. కేసీఆర్ ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయారు. ఇక తాజా పరిస్థితుల నేపథ్యంలో మరోసారి రాజధాని సహా కేసులు ఎక్కువగా ఉన్న జిల్లాలో లాక్ డౌన్ దిశగా సర్కార్ సన్నాహాలు చేస్తోన్న సంగతి తెలిసిందే.
లాక్ డౌన్ పెడదామా? వద్దా? అన్న దానిపై ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులతో నేడు చర్చించనున్నారు. అటుపై ప్రభుత్వ ఉన్నతాధికారులలో సమావేశం కానున్నారు. ఈ రెండింటి తర్వాత కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో నివసిస్తోన్న ఇంతర ప్రాంతాల వారు బెంబేలెత్తి స్వగ్రామాలకు పరుగులు తీస్తున్నారు. లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో ఉద్యోగాలు చేసుకునేవారు, చిన్న చిన్న పనులు చేసుకునే వారు తిరిగి హైదరాబాద్ కు ఇటీవలే చాలా మంది వరకూ చేరుకున్నారు. అయితే మళ్లీ ఇప్పుడు లాక్ డౌన్ దిశగా చర్యలకు సిద్దమవ్వడంతో వాళ్లంతా తిరుగు ప్రయాణం పడుతున్నారు.
జాతీయ రహదారుల వెంబడి కార్లు జోరుగా పరుగులు తీస్తున్నాయి. టోల్ గేట్ల వద్ద వాహనాలు బారుతు తీరుతున్నాయి. అటు ఏపీ కి రావాలంటే పోలీస్ అధికారులు అనుమతులు కావాలంటూ కొత్తగా ప్రకటన జారీ చేసారు. చెక్ పోస్ట్ ల వద్ద ఆక్షలు కొనసాగుతాయని డీజీపీ గౌతమ్ సవాంత్ తెలిపారు. దీంతో అనుమతులకు పరుగులు తీసుకుని స్వరాష్ర్టాలకు చేరుకోవాలని చూస్తున్నారు. అయితే కేందంఎలాంటి అనుమతులు అవసరం లేదని చెప్పడంతో కొందరు ఆవిధంగాను చేరుకునే యత్నం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా తిరుగు ప్రయాణం పట్టే వారు రెండు విషయాలు స్పష్టంగా చెబుతున్నారు.
ఒకటి లాక్ డౌన్ తో ఎదురయ్యే ఇబ్బందులు ఒక ఎత్తైతే…పొరపాటున కరోనా సోకితే అక్కడ ప్రభుత్వం ఎంత మాత్రం పట్టించుకోలేదని చెబుతున్నారు. ఇటీవల అక్కడ చోటు చేసుకున్న పరిణామాల్నే ఉదహరణగా చూపిస్తున్నారు. ఆ రెండు భయాలతోనే వెనుదిరగాల్సి వస్తోందని వాహనదారులు, ప్రయాణికులు చెబుతున్నారు. కార్లలో , ద్విచక్ర వాహనాలపై, ఇతర మార్గాల ద్వారా స్వగ్రామానికి చేరే ప్రయత్నాలు ఇప్పుడు తెలంగాణ రాష్ర్టం నుంచి, హైదరాబాద్ సిటీ నుంచి జోరుగా సాగుతున్నాయి. ఇక ఐటీ సహా పలు కార్పోరేట్ కంపెనీలు వర్క్ ప్రమ్ హోమ్ వెసులుబాటు ఇవ్వడంతో మైండ్ స్పేస్, మాధాపూర్, గచ్చిబౌలి ఏరియాల్లో నెలకొన్న ఐటీ కంపెనీలు ఉద్యోగులు లేక వెల వెలబోతున్నాయి. ఇంకొంత మంది మేథావులు లాక్ డౌన్ వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని, అంతా నష్టామేనని, లాక్ డౌన్ నాన్సెన్స్ అన్నట్లు మాట్లాడుతున్నారు.