బాబోయ్ కరోనా. ఈ వైరస్ వల్ల ఎంతోమంది ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రపంచం మొత్తాన్ని గడగడలాడిస్తోంది. ఓడలన్నీ బండ్లయ్యాయి. లక్షాధికారులు కూడా బిక్షాధికారులు అయ్యారు. ఏమాత్రం కనికరం లేకుండా ప్రపంచాన్ని నాశనం చేసేస్తోంది కరోనా.
బయటికి వెళ్లాలంటే కరోనా. ఏదైనా పనిచేద్దామంటే కరోనా. కనీసం సరుకులు తెచ్చుకుందామన్నా కరోనానే. అయ్యబాబోయ్.. ఏందో ఈ ఎదవ జీవితం.. అని అనిపించేలా చేస్తోంది కరోనా.
పుసుక్కున బయటికి వెళ్తే.. ఇంటికి వచ్చేలోపల ఎక్కడ కరోనా అంటుకుంటుందో అని బిక్కుబిక్కుమంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరోనా వల్ల ఇబ్బందులు పడని మనుషులు లేరు. అంతలా జనాలను భయపెడుతున్న కరోనా.. తాజాగా మరోసారి భయపెట్టడానికి సిద్ధమయింది.
ఈ వైరస్ ఏ వస్తువుపై ఎంత సేపు ఉంటుందో తెలుసుకోవడం అనేది పెద్ద సమస్యగా మారింది. ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెబుతుండటమే దీనికి కారణం. అయితే.. కొంత మంది పరిశోధకులు, డాక్టర్లు మాత్రం కరోనా వైరస్ దేని మీద ఎంత సేపు బతుకుతుందో పరిశోధన చేసి మరీ వెల్లడించారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా కరోనా వైరస్ పై అనేక పరిశోధనలు చేసి… ఏ వస్తువుపై కరోనా ఎంతసేపు బతుకుతుందో తెలిపారు.
అయితే.. తాజాగా తెలిసిన విషయం ఏంటంటే.. కళ్లద్దాలు ఉంటాయి కదా.. వాటిపై కరోనా వైరస్ ఏకంగా 9 రోజుల పాటు ఉంటుందట. ఇది నిజంగా షాకింగ్ విషయమే. ఎందుకంటే.. ప్రపంచంలో నూటికి తొంబై మంది కళ్లద్దాలు ధరించే వాళ్లే. కళ్లద్దాలు ధరించి బయటికి వెళ్లిన వాళ్లు.. ఇంటికి వచ్చాక ఖచ్చితంగా వాటిని శుభ్రం చేసుకోవాలి.
అయితే.. కళ్లద్దాలను శానిటైజర్లతో కాకుండా… హైడ్రోజన్ పెరాక్సైడ్ ద్రావణంతో శుభ్రం చేసుకుంటే మంచిది. కండ్లద్దాలపై కరోనా వైరస్ 9 రోజుల వరకు బతుకుతుందని… ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి కంటి వైద్యుడు అక్షయ్ తెలిపారు.
కరోనా గాలి ద్వారా సోకదని.. వస్తువులపై మాత్రం కొన్ని రోజుల వరకు బతుకుతుందని యునిసెఫ్ కూడా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఒకవేళ వైరస్ అంటిన వస్తువులను ముట్టుకొని… అదే చేతులతో నోట్లో కానీ.. ముక్కులో కానీ చేయి పెట్టుకుంటేనే వైరస్ సోకుతుందని యూనిసెఫ్ స్పష్టం చేసింది.
ఏదైనా వస్తువు మీద వైరస్ పడ్డప్పుడు కనీసం 12 గంటల వరకు అది అక్కడ ఉంటుందని.. వెంటనే ఆ వస్తువును సబ్బుతో కానీ.. నీళ్లతో కానీ కడిగితే ఆ వైరస్ నాశనం అవుతుందని చెప్పింది. అలాగే బట్టల మీద కూడా వైరస్ 9 గంటల పాటు ఉంటుందట. ఓ రెండు గంటలు బట్టలను ఎండలో ఆరబెడితే వైరస్ చచ్చిపోతుందట. కాకపోతే.. కళ్లద్దాల మీద మాత్రం 9 రోజుల వరకు వైరస్ జీవిస్తుంది.