ప్రస్తుతం కరోనా (కొవిడ్-19) వైరస్ దెబ్బకి ప్రపంచం అల్లకల్లోలమవుతోంది. వేలాది మరణాలు కకావికలం చేస్తున్నాయి. అనధికారికంగా చైనాలో 40 వేల మరణాలతో పాటు లక్షలాది కేసులు నమోదవ్వడం….అనుమానిత కేసులు రోజు రోజుకి ఊహించిన దానకంటే రెట్టింపు అవ్వడంతో కరోనా పేరెత్తిత్తే గడగడలాడాల్సిన సన్నివేశం ఎదురైంది. అమెరికా- బ్రిటన్- స్పెయిన్- ఇటలీ కరోనా శ్మశానాలుగా మారుతున్నాయి. భారత్ లోనూ కరోనా రోజు రోజుకి విజృంభిస్తోంది.
కరోనా చైన్ ని తుంచేయాలని లాక్ డౌన్ ప్రకటించినా ఢిల్లీ నమాజ్ ఇప్పుడు భారత్ కి పెను సవాల్ గా మారింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో జరిగిన ప్రార్ధనపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. అత్యవసర భేటిలతో అలార్మో మోగించింది. ప్రత్యక్షంగా ఇటు ప్రజలు యుద్దం చేస్తున్నారు. నిజానికి ఇలాంటి పరిస్థితి వస్తుందని భారత్ అస్సలు ఊహించలేకపోయింది. ఎక్కడో చైనాలో వచ్చింది. అక్కడితో అంతమైపోతుందని భావించారు కానీ.. అది భారత్ పైనా పంజా విసురుతుందని ఊహించలేదు. ఎక్కడో పుట్టిన వైరస్ కి ఇంత పవర్ ఉందా? అని ప్రపంచ దేశాలు సహా మానవుడు ఒణికిపోయే సీన్ ఎదురైంది. అయితే ఇలాంటి విపత్తులను ఉద్దేశించి కొన్ని హాలీవుడ్ సినిమాలు ప్రపంచాన్ని ముందే హెచ్చరించాయి. అందులో టాప్ -10 మూవీస్ ఏవి అన్న వివరాల్లోకి వెళితే..
కరోనా లాంటి వైరస్ లు..బ్యాక్టిరియాలు ఔట్ బ్రేక్ అయితే ? ఎలా ఉంటుందో ముందే వెండితెరపై ప్రముఖ దర్శకులు కథలు రాసుకుని దృశ్య రూపం ఇచ్చారు. ఇప్పుడు ప్రపంచ దేశాలు ప్రత్యక్షంగా ఆ సన్నివేశాన్ని చూస్తున్నాయి. వైరస్.. బ్యాక్టీరియా కాన్సెప్ట్ లకు రియలిజమ్..సెన్సిబిలిటినీ..ఎంటర్ టైన్ మెంట్ ని జోడించి తెరకెక్కించిన టాప్ 10 సినిమలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
వీటిలో నెంబర్ 10 స్థానంలో రెండు సినిమాలున్నాయి. `28 డేస్ లేటర్` (2003)..`28 వీక్స్` (2007) … అప్పట్లోనే సెన్సేషన్. స్లమ్ డాగ్ మిలీయనీర్ డైరెక్టర్ డానీ బోయలే ఈ సిరీస్ దర్శకుడు. `28..` సిరీస్ లో తొలి సినిమా 2003లో రిలీజ్ అయింది. అటు పై 28 వీక్స్ 2007 లో రిలీజ్ అయింది. ఈ రెండు సినిమాల్లో కామన్ గా కనిపించే వైరస్ పేరు `రేజ్`. రేజ్ అంటే తెలుగులో కోపం అని అర్ధం. ఈ వైరస్ సోకిన వాళ్లంతా విపరీతమైన కోపం.. వెర్రి.. పిచ్చి జాంబీలా మారిపోతారు. కోపాన్ని..అగ్రెసివ్ నెస్ ప్రమాదకరంగా ఉంటుంది. అయితే వీటిని కంట్రోల్ చేయడానికి కేంబ్రిడ్స్ శాస్త్ర వేత్తలు ఓ ముందుని కనిపెడతారు. కానీ పరీక్షించడంలో ఫెయివ్వడంతో.. ఓ చింపాజీ శరీరంలోకి వైరస్ ని ఎక్కిస్తారు. అలా వైరస్ ఔట్ బ్రేక్ అయి మనుషులకు పాకుతింది. అటుపై మానవాళికి ఎలాంటి ముప్పు వాటిల్లింది? అన్న ఈ పాయింట్ ని డానీ బోయల్ ఎంతో ఎంగేజింగ్…థ్రిల్లింగ్ గా తెరకెక్కించి సక్సెస్ అయ్యారు.
ఇక టాప్-9 లో `ఇట్ కమ్స్ ఎట్ నైట్ 2017` అనే మూవీ ఉంది. ఇదొక ఫ్యామిలీ డ్రామా..ఓ తెలియని డిసీజ్ భూమ్మీద ఉన్న మనుషులను చంపుతుంది. మనుషుల్ని మనుషులే నమ్మకూడదని ఆ డీసిజ్ ఓ సందేశాన్ని ఇస్తుంది. ఇదొక యూనిక్ మూవీ అనే చెప్పాలి. టాప్ -8 లో `చిల్ట్రన్ ఆఫ్ మెన్ 2006` . ఇందులో వైరస్ ని చూపించరు. కానీ కాన్సెప్ట్ మాత్రం క్రేజీగా ఉంటుంది. భవిష్యత్ లో మనుషులు రీ ప్రొడ్యూస్ చేసే పవర్ ని కోల్పోతారు. అంటే పిల్లలు పుట్టడం అనేది ఆగిపోతుంది. ఇదొక సైన్స్ ఫిక్షన్ జానర్. భూమ్మీద జరిగే మార్పులను ముందే చెప్పడం ఈ సినిమా స్పెషాలిటీ. ఇదొక విజువల్ ఫీస్ట్ గా చెప్పొచ్చు. టాప్ 7 లో `12 మంకీస్ 1995` ఉంది. వైరస్ ఔట్ బ్రేక్ కి టైమ్ ట్రావెల్ ట్విస్ట్ ఇచ్చిన క్రేజీ మూవీ ఇది. ప్యూచర్ లో ఒక వైరస్ పాపులేషన్ మొత్తాన్ని నాశనం చేస్తుంది. దీన్ని ఆపడానికి హీరో టైమ్ ట్రావెల్ చేసి పాస్ట్ లోకి వెళ్తాడు. ఎంతో ఎగ్జైటింగ్ గా ఉంటుందీ చిత్రం.
టాప్ 6 లో `బ్లైండ్ 2008` ఉంది. ఒక జపనీ ఉన్నట్లుండి చూపుని కోల్పోతాడు. తర్వాత ఆ జబ్బు అందరికీ పాకి కళ్లు కోల్పోతారు. దీన్ని పరిష్కరించడం కోసం కళ్లు కోల్పోయిన వారందరని ఐసోలేట్ చేసి ఒక చోట చేర్చి ట్రీట్ మెంట్ చేస్తారు. కానీ అక్కడా మనిషికి మనిషే శత్రువని చెప్పే సినిమా ఇది. ఇది ఒక వైరస్ బేస్ట్ మూవీ. ఇక టాప్ 5 లో `వరల్డ్ వార్ జెడ్ 2013` ఉంది. జాంబీ వైరస్ వ్యాపించి ప్రపంచమంతా శర్వనాశనం అవుతుంది. ఒక వైరస్ ఔట్ బ్రేక్ అయితే ప్రక్క దేశాల సహాయం ఎలా ఉంటుంది? వైరస్ కంట్రోలింగ్ కి తీసుకునే చర్యలు ఎలా ఉంటాయనేది సినిమాలో హైలైట్ గా చూపించారు. ఒక టాప్ 4 లో `ప్లూ 2013`. ఇదొక కొరియన్ బేస్ట్ వైరస్ ఔట్ బ్రేక్ మూవీ. కొంత మందిని హాకాంగ్ నుంచి కొరియాకి కంటెయినర్లో తరలించేటప్పుడు ఒకరికి వైరస్ ఎటాక్ అవుతుంది. అక్కడ నుంచి వైరస్ అందరికీ సోకడంతో అంతా క్వారంటైన్ జోన్ లోకి వెళ్లిపోతారు. దీంతో అంతా అతలాకుతలం అవుతుంది.
ఇక టాప్ 3 లో `ఔట్ బ్రేక్ 1995` నిలిచింది. అడవి నుంచి ఓ వైరస్ మనుషుల్లోకి వస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపించారు. మోటాబా అనే వైరస్ ని ఎలా కంట్రోల్ చేసారన్నది అసలు థీమ్. అప్పట్లో హాలీవుడ్ లో సంచలనం సృష్టించిన సినిమా ఇది. ఇక టాప్ 2 లో ఇండియన్ సినిమా నిలిచింది. అదే `వైరస్ 2019`. ఇది కేరళలో నిఫా వైరస్ ఉందని రుజువైన నేపథ్యంలో తీసిన ఓ మలయాళీ సినిమా. ఇండియాలో ఇప్పటివరకూ రిలీజ్ అయిన బెస్ట్ వైరస్ మూవీగా దీన్ని చెప్పొచ్చు. ఇక టాప్ 1లో `కంటెజియన్`( 2011). గత నెల రోజులుగా ఇంటర్ నెట్ లో ఎక్కువగా చూస్తోన్న సినిమా ఇదే. ప్రస్తుత కరోనా ఎఫెక్ట్ ని ఈ సినిమా కళ్లకు కట్టింది. చైనాలో పుట్టిన ఒక వైరస్ ఓ లేడీ ద్వారా ఏసీలో కి ప్రవేశిస్తుంది. ఎవరైతే ఆమెతో కాంటాక్ట్ అవుతారో వాళ్లందరికి వైరస్ సోకుతుంది. దగ్గు..జ్వరం తో మొదలయ్యే ఈ వ్యాధి మనిషిని నిమిషాల్లోనే మింగేస్తుంది. ఇలాంటి ఓ డెడ్లీ డిసీజ్ ని ప్రభుత్వాలు ఎలా ఎదుర్కొన్నాయన్నది ఆసక్తికరంగా చూపించారు. ఇదొక మెడికల్ థ్రిల్లర్. ఇలా ప్రపంచాన్ని ఒణికించే వైరస్ ల గురించి హాలీవుడ్ సినిమాలు ముందే చెప్పేసాయి. ప్రస్తుతం కరోనా ట్రెండింగ్ లో ఉంది కాబట్టి…. హాలీవుడ్ డైరెక్టర్లు కరోనాని ఎన్ని సిరీస్ లు గా తెరకెక్కిస్తారో చూడాలి.