Corona update in AP: రాష్ట్రంలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు నమోదయ్యాయంటే ?

Corona update in Andhra pradesh on December 26,2021

Corona update in AP: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 17,940 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా… కొత్తగా 54 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్‌ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా బారినపడిన వారి సంఖ్య 20,73,651 కి చేరింది. కరోనా కారణంగా నిన్న ఎవరూ మరణించలేదని పేర్కొంది. దీంతో రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 14,490 వద్ద స్థిరంగా ఉంది.

కరోనాబారి నుంచి నిన్న 121 మంది కోలుకోగా వారితో కలిపి ఇప్పటి వరకు మొత్తం 20,58,062 మంది కోలుకున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం ఏపీలో 1,099 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కాగా ఇప్పటివరకు రాష్ట్రంలో 3,11,99,604 కరోనా నిర్థారణ పరీక్షలు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే… అనంతపురం -00, చిత్తూరు-19, తూర్పుగోదావరి-05, గుంటూరు-07, కడప-00, కృష్ణ-04, కర్నూలు-01, నెల్లూరు-05, ప్రకాశం-00, శ్రీకాకుళం-00, విశాఖపట్నం-13, విజయనగరం-00, పశ్చిమ గోదావరిలలో-00 చొప్పున కేసులు నమోదయ్యాయి.

ఇక ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య దేశంలో 578కు చేరింది. ఒమిక్రాన్ బాధితుల్లో 151 మంది కోలుకున్నారు. మ‌హారాష్ట్ర‌లో 141, ఢిల్లీలో 142, కేర‌ళ‌లో 15, గుజ‌రాత్‌లో 14, రాజ‌స్థాన్‌లో 43, తెలంగాణ‌లో 34, తమిళనాడులో 31, క‌ర్ణాట‌క‌లో 31, మధ్యప్రదేశ్ లో 9, ఆంధ్రప్రదేశ్ లో 6, పశ్చిమ బెంగాల్ లో 6, హర్యానాలో 4, ఒడిశా లో 4, చండీఘర్ లో 3, జమ్మూ కాశ్మీర్ లో 3, యూపీలో 2, హిమాచలప్రదేశ్ లో 1, లడఖ్ లో 1, ఉత్తరాఖండ్ లో 1, ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి.

ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం కరోనా నిబంధనలను అమలుచేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో నైట్ కర్ఫ్యూ విధించగా తాజాగా బెంగళూరు లో పది రోజుల పాటు నైట్ కర్ఫ్యూ విధించటం దేశంలో చర్చనీయాంశంగా మారింది. మూడో వేవ్ తప్పదన్న వాదనకు ఇది సంకేతంగా పరిగణిస్తున్నారు. రానున్న రోజుల్లో వరుసగా న్యూ ఇయర్, సంక్రాంతి పండుగలున్న నేపథ్యంలో కేసులు మరిన్ని పెరుగుతాయని, ఈ క్రమంలో కట్టు దిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలు యోచిస్తున్నాయి.