తెలంగాణ రాష్ర్టంలో కరోనా వైరస్ సమాజంలోకి వెళ్లిపోయిందని వైద్యశాఖ హెచరిస్తోంది. వైరస్ ఎక్కడ ఉంటుందో? ఏ మేరకు ఉంటుందో? మనకు తెలియదని వైద్య ఆరోగ్య శాఖ తేల్చేసింది. వచ్చే నాలుగైదు వారాలు చాలా క్లిష్టమైన పరిస్థితులు ఉంటాయని హెచ్చరించింది. హైదరాబాద్ జిల్లాలోనే కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే పాజిటివ్ కేసులు సంఖ్య 50 వేలు దాటిపోయింది. ఇక వర్షాలు కూడా భారీగా పడుతున్నాయి. దీంతో జ్వరాలు కూడా ఎక్కువ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏది కరోనా జ్వరమో! ఏది సాధారణ జ్వరమో కూడా తెలియని పరిస్థితి నెలకొంటుంది.
దీంతో నగర వాసులు బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికే సీటీ చాలా వరకూ ఖాళీ అయింది. ఈ నేపథ్యంలో ఇంకా ఖాళీ అవుతోంది. ఇక ప్రజా ప్రతినిధులు వరుసగా వైరస్ బారిన పడుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలవురు టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు వైరస్ బారిన పడి కోలుకున్నారు. అలాగే ప్రజా ప్రతినిధుల వ్యక్తిగత సిబ్బంది, కారు డ్రైవర్లు, గన్ మెన్లు కూడా కరోనా బారిన పడి ఉన్నారు. ఇందులో కొంత మంది కోలుకోగా మరికొంత మంది ఐసోలేషన్ లో ఉన్నారు. తాజాగా టీఆర్ ఎస్ సీనియర్ నేత, నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత కారు డ్రైవర్ కరోనా బారిన పడ్డాడు.
కారు డ్రైవర్ దగ్గు, జ్వరం, జలుబుతో బాధపడుతుండటంతో కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం అతను ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీంతో కవిత అనుమానంతో హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. కొన్ని రోజుల పాటు ఇల్లు వదిలి బయటకు రాకూడదని నిర్నయించుకున్నారుట. కరోనా కితగ్గ మాత్రలు, విటమిన్ మాత్రులు ముందుగానే తీసుకుంటూ జాగ్రత్తపడుతున్నట్లు తెలిసింది. కవిత అభిమానులు, టీఆర్ ఎస్ కార్యకర్తలు ఆమె ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు.