చెప్పట్లేదు కానీ.. ఇండస్ట్రీలో చాలామందికి కరోనా ?

Corona second wave hitting tollywood very hard

Corona second wave hitting tollywood very hard

కరోనా సెకండ్ వేవ్ గట్టిగానే తాకుతోంది. రోజూ వేల కేసులు బయటపడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడ వైరస్ తాకిడి ఎక్కువగానే ఉంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది స్టార్లు కరోనాకు గురయ్యారు. ఇటీవల బండ్ల గణేష్, నివేత థామస్, దిల్ రాజు, అల్లు అరవింద్, విజయేంద్ర ప్రసాద్ లాంటి వాళ్లకు కరోకా సోకగా పవన్ కళ్యాణ్ క్వారంటైన్లోకి వెళ్లిపోయారు. ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం మేరకు ఇంకా చాలామంది స్టార్లు కరోనాకు గురైనట్టు తెలుస్తోంది. పేర్లు, వివరాలు బయటకు రావట్లేదు కానీ పెద్ద వాళ్లే కొందరు క్వారంటైన్లో ఉన్నారట. ఇటీవలే స్టార్ దర్శకుల జాబితాలో చేరిన ఒక యువ దర్శకుడికి కరోనా పాజిటివ్ అని అంటున్నారు.

ఇప్పటికే పలు పెద్ద సినిమాల షూటింగ్స్ నిలిచిపోయాయి. అవుట్ డోర్ షూటింగ్ కోసం వెళ్లిన చాలామంది వెనక్కి తిరిగి వచ్చేస్తున్నారు. ‘హరి హర వీరమల్లు, ఎఫ్ 3’ సహా ఇంకొన్ని పెద్ద సినిమాల షూటింగ్స్ పోస్ట్ ఫోన్ అయ్యాయి. త్వరలో మొదలుకావాల్సిన ఇంకొన్ని సినిమాలు మొదలుకావని తెలుస్తోంది. విడుదలలు పోస్ట్ ఫోన్ అయ్యాయి. మొత్తానికి పరిస్థితి కొంత ఆందోళనకరంగానే ఉన్నట్టుగా ఉంది. రేపో మాపో థియేటర్లు బంద్ కావడమో లేకపోతే 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధనలు రావడమో జరుగుతుందట.