కాంతార సీక్వెల్…. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ రిషబ్ శెట్టి?

హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై రిషబ్ శెట్టి హీరోగా స్వీయ దర్శకత్వంలో వచ్చిన కాంతారా సినిమా వసూళ్ల పర్వం కొనసాగుతూనే ఉంది. రిలీజ్ అయ్యి దాదాపు 50 రోజులు కావస్తున్న విడుదలైన అన్ని సెంటర్లలో భారీ కలెక్షన్లను రాబడుతూ సినీ ఇండస్ట్రీ రికార్డులను అధిగమిస్తూ దూసుకుపోతోంది. చిన్న సినిమాగా కన్నడ భాషలో విడుదలై కాంతారా సినిమా మంచి విజయం సాధించడంతో తెలుగు ,తమిళ్ ,హిందీ భాషల్లో కూడా రిలీజ్ చేశారు విడుదలైన అన్ని సెంటర్లలో దాదాపు 350 కోట్ల రూపాయలు గ్రాస్ సాధించి కన్నడ ఇండస్ట్రీ స్థాయిని మరింత పెంచిందని చెప్పొచ్చు.

హీరో రిషబ్ శెట్టి కాంతారా సినిమా కథను90 నాటి ప్రజల జీవన విధానాన్ని రాచరిక అరాచకాలను చక్కగా అభివర్ణిస్తూ ప్రజలకు ఆసక్తిని రేకెత్తించాడు.
ఆదివాసీల పురాతన సాంప్రదాయ జానపద కల అయినా భూతకోల వృత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసి రిషబ్ శెట్టి నటనపరంగా దర్శకత్వం పరంగా మంచి గుర్తింపు తెచ్చుకొని సినీ ప్రముఖుల చేత ప్రశంసలు అందుకున్నాడని చెప్పొచ్చు.తాజాగా ప్రముఖ ఆంగ్ల వెబ్‌సైట్‌తో రిషబ్‌శెట్టి మాట్లాడుతూ ఈ సినిమాకు సంబంధించిన సీక్వెల్ పై స్పందించి మరింత ఆసక్తిని రేకెత్తించాడు.ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలు రిషబ్ శెట్టి మాట్లాడుతూ ఇప్పటికిప్పుడు కాంతారా సీక్వెల్ పై స్పందించలేను. ఇంతటి ప్రేక్షకు ఆదరణ పొందిన కాంతారా సినిమా సీక్వెల్ కచ్చితంగా ఉంటుంది.

కాంతారా కథలో ఎన్నో ఉపకథనాలు ఉన్నాయి వాటి నుంచి సీక్వెల్ కథను ప్రారంభిస్తామని రిషబ్ శెట్టి తెలిపారు. ప్రస్తుతానికైతే మా అదృష్టంతా కాంతారా సినిమా పైనే ఉంది. ఇంకా ఈ సినిమాలో హైలెట్ గా నిలిచిన ప్రాచీన జానపద కళ భూతకోలా గురించి మాట్లాడుతూ మేము దీన్ని దైవకోల అని కూడా అంటాం.అది ఆడేటప్పుడు పలికేది కేవలం ఒక శబ్దం మాత్రమే కాదు అది ఒక ప్రకటన,అదొక తీర్పు, భావోద్వేగం,దీవెన చిన్నప్పటి నుంచి నేను దైవకోలను చూస్తూ పెరిగాను. ప్రకృతి శక్తి మొత్తం మనిషిలో నిండిపోతే ఏం జరుగుతుందో దాన్నే నేను చూపించే ప్రయత్నం చేశా అంటూ భావోద్వేగంతో తన మనసులోని మాటలు చెప్పుకొచ్చారు.