ప్రపంచ వ్యాప్తంగా విశ్వరూపం చూపిస్తున్న కరోనా వైరస్, ఇండియలో కూడా పంజా విసురుతోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా తీవ్రత ఎక్కువగానే ఉంది. ప్రజా ప్రతినిధులను సైతం కరోనా వదలడంలేదు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో పలువురు రాజకీయనేతలకు కరోనా సోకింది. ఇక ముఖ్యంగా ఏపీలో మాత్రం వైసీపీ నేతల్ని కరోనా టార్గెట్ చేసింది.
ఈ నేపధ్యంలో ఇప్పటి వరకు ఏపీలో డిప్యూటీ సీఎం అంజాద్ భాషా, విజయనగరం జిల్లా ఎస్ కోట ఎమ్మెల్యే శ్రీనివాసులు, పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య, సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పడు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.
కొద్ది రోజులుగా ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి అస్వస్థతగా ఉండటంతో, తాజాగా కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఈ క్రమంలో ఆయనకు కరోనా పాజిటివ్‌గా లేలింది. ఆయన భార్యకు కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో వెంటనే ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి కుటుంబ సభ్యలు క్వారంటైన్‌కు తరలి వెళ్లారు. అధికార పార్టీ నేతలు కావడంతో ప్రజల సంక్షేమం కోసం, పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్న నేపధ్యంలో వైసీపీ నేతలకి కరోనా అటాక్ అవుతుంది. దీంతో పార్టీ వర్గాలు మరింతి జాగ్రత్తగా ఉండాలని అధిష్టానం సూచించిందని సమాచారం.