Corona update in AP: గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో రోజుకు దాదాపు 4,000లకు పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అలానే గత 24 గంటల్లో 22,882 శాంపిల్స్ ను పరీక్షించగా 4,108 కొత్త కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. అయితే నిన్న ఒక్క మరణం కూడా లేకపోవటం మంచి విషయం. గడిచిన 24 గంటల్లో 696 మంది కోవిడ్ నుండి కోలుకున్నారు.
ఏపీలో ఇప్పటివరకు మొత్తం 3,18,84,914 కోవిడ్-19 నమూనాలను పరీక్షించగా 21,07,493 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 20,62,801 మంది డిశ్చార్జ్ కాగా 14,510 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 30,182. ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే… అనంతపురం -162, చిత్తూరు-1004, తూర్పుగోదావరి-263, గుంటూరు-345, కడప-295, కృష్ణ-170, కర్నూలు-85, నెల్లూరు-261, ప్రకాశం-176, శ్రీకాకుళం-114, విశాఖపట్నం-1018, విజయనగరం-169, పశ్చిమ గోదావరిలలో-46 చొప్పున కేసులు నమోదయ్యాయి.
రాష్ట్రంలో అత్యధిక కోవిడ్ కేసులతో విశాఖపట్నం (1018) టాప్ లో నిలవగా అత్యల్పంగా పశ్చిమ గోదావరిలో 46 కేసులు నమోదయ్యాయి. అయితే ఇప్పటివరకూ మొత్తంమీద 2,97,333 పాజిటివ్ కేసులతో తూర్పు గోదావరి జిల్లా తొలి స్థానంలో ఉంది. ఇక ఏపీలో రేపటి నుండి నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. అత్యవసర విభాగాలలో పనిచేసేవారు తమ ఐడి కార్డులను చూపించాల్సి ఉంటుంది. వివిధ ప్రాంతాలకు ప్రయాణించేవారు తమ బస్సు టికెట్స్ ను చూయించాలి. మాస్క్ లు ధరించకుండా కనిపిస్తే జరిమానాలు తప్పవని ప్రభుత్వం ప్రకటించింది.