Tadipatri: ఎట్టకేలకు తాడిపత్రిలో అడుగుపెట్టిన పెద్దారెడ్డి… అరెస్టు చేసిన పోలీసులు!

Tadipatri: అనంతపురం జిల్లా తాడిపత్రి రాజకీయాలు ఎప్పుడు కూడా హాట్ టాపిక్ గానే ఉంటాయి. నిత్యం ఈ ప్రాంతంలో జెసీ వర్సెస్ పెద్దారెడ్డి అనే విధంగా విభేదాలు జరుగుతూనే ఉంటాయి. అయితే గత ఐదు సంవత్సరాలు కాలంలో తాడిపత్రి ఎమ్మెల్యేగా పెద్దారెడ్డి బాధితులు తీసుకున్న విషయం తెలిసిందే. ఇక మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికలలో పెద్దారెడ్డి ఘోర ఓటమి పాలయ్యారు. ఇక ఈ ఎన్నికల సమయం నుంచి తాడిపత్రిలో ఈ ఇద్దరు మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. జెసి ప్రభాకర్ రెడ్డి తన అనుచరులతో పెద్దారెడ్డి ఇంటి పై దాడి చేయించారనే సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు పెద్దారెడ్డి తాడిపత్రిలో ఉండడం మంచిది కాదంటూ ఆయనను తాడిపత్రి నుంచి పంపించేశారు.

ఇక పెద్దారెడ్డి తాడిపత్రిలో అడుగు పెట్టాలి అంటే కచ్చితంగా కోర్ట్ అనుమతి ఉండాల్సింది కానీ ఇప్పటివరకు కోర్ట్ అనుమతి లేకపోయినప్పటికీ ఈయన పలుమార్లు తాడిపత్రి రావడానికి ప్రయత్నాలు చేసినా పోలీసులు అడ్డుకున్నారు. అయితే ఏడాదికి ఈయన తాడిపత్రిలోనే తన నివాసానికి వెళ్లారు. దీంతో మరోసారి తాడిపత్రిలో రాజకీయాలు దుమారం రేగుతున్నాయి. ఇలా ఏడాది తర్వాత తాడిపత్రిలోకి పెద్దారెడ్డి అడుగుపెట్టిన మరుక్షణమే పోలీసులు తనని అరెస్టు చేసి తీసుకు వళ్లిపోయారు.

పెద్దారెడ్డి తాడిపత్రిలో ఉండడానికి అనుమతి లేదు అంటూ పోలీసులు బలవంతంగా తనని అరెస్టు చేశారు అయితే తన ఇంట్లో తాను ఉండటానికి అనుమతి ఏంటీ అంటూ పెద్ద రెడ్డి వాదనకు దిగిన పోలీసులు మాత్రం ఆయనను బలవంతంగా అరెస్టు చేసి రహస్య ప్రాంతానికి తరలించారు. పెద్దారెడ్డి తాడిపత్రిలో ఉంటే జేసీ అనుచరులు గొడవకు పాల్పడతారన్న ఉద్దేశంతోనే పోలీసులు ముందస్తు చర్యలలో భాగంగా పెద్దారెడ్డిని తాడిపత్రి నుంచి బలవంతంగా తీసుకెళ్లిపోయారు.