JC Prabhakar Reddy: నోట్లకట్లు విసురుతూ నటి మాధవి లతకు క్షమాపణలు చెప్పిన జేసీ?

JC Prabhakar Reddy: తాడిపత్రి మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ బిజెపి నాయకులు అనే విధంగా వివాదం చోటు చేసుకున్న విషయం మనకు తెలిసిందే. డిసెంబర్ 31వ తేదీ రాత్రి తాడిపత్రిలో జెసి పార్కులో పెద్ద ఎత్తున వేడుకలు జరిగాయి అయితే ఈ వేడుకలకు మహిళలు ఎవరు వెళ్ళద్దు అంటూ బిజెపి మహిళా నేతలు సాదినేని యామిని సినీనటి మాధవి లత వీడియోలు చేసిన సంగతి తెలిసిందే.

ఇలా జెసి పార్క్ వద్దకు మహిళలు వెళ్లదు అంటు వీరు చేసిన వీడియో తీవ్ర దుమారం రేపింది. ఈ వీడియోలపై ఏకంగా జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందిస్తూ మహిళలను కూడా చూడకుండా వారిపట్ల దుర్భాషలాడారు. దీంతో ఈ వ్యాఖ్యలను బీజేపీ నేతలు అలాగే మాధవి లత కూడ స్పందిస్తూ ఖండించారు. అయితే తాజాగా మహిళల గురించి తాను మాట్లాడిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి క్షమాపణలు చెప్పడమే కాకుండా మరికొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా ఆయన ఒక వీడియోని విడుదల చేస్తూ అందులో తన ఎదురుగా ఉన్నటువంటి టీపాయ్ మీద నోట్ల కట్టలను విసిరి వేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు… తాను ఒక పిలుపునిస్తే ప్రజల నుంచి వచ్చే స్పందన ఇది అంటూ ఆయన నోట్ల కట్లను విసరారు. జేసీ పార్కు కోసం విరాళాలు ఇవ్వాలని నేను ఎవరిని బలవంతంగా అడగలేదు. తాడిపత్రి అంటే వారికి ప్రేమ ఉంది కనుక పెద్ద ఎత్తున విరాళాలు అందించారని జేసీ తెలిపారు.

ఇక తనపై విమర్శలు చేసేవాళ్లంతా ఫ్లెక్సీగాళ్లే అంటూ మండిపడ్డారు జేసీ ప్రభాకర్ రెడ్డి. అదృష్టం కలిసివచ్చి కొందరు నాయకులు అయ్యారని విమర్శించారు. ఇక నా గురించి ఎవరైతే మాట్లాడుతున్నారో అలాంటి వారందరూ కూడా ప్రజలకు సేవ చేస్తే బాగుంటుంది అంటూ ఈ సందర్భంగా జేసీ దివాకర్ రెడ్డి చేసిన ఈ కామెంట్స్ మరో వివాదానికి తెరతీసాయి. అయితే కొద్ది రోజులుగా ఈయన ఏదో ఒక విషయం గురించి మీడియా సమావేశాలలో మాట్లాడుతూ అలాగే వీడియోల ద్వారా సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే.