ఆ నేతపై వైసీపీలోనే కుట్రలు..దిగజారిన వైసీపీ మీడియా

ysrcp social media

 అధికారంలో ఉన్న పార్టీలో చిన్న చిన్న విభేదాలు అనేవి సహజమే, పైగా అధికారం ఉంటుంది కాబట్టి వర్గ పోరు కూడా ఉంటుంది. ఇక ప్రకాశం జిల్లా చీరాలలో ఈ పోరు మరింత తీవ్రస్థాయి లో వుంది. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ కి చెందిన ఆమంచి కృష్ణ మోహన్ మీద గెలిచిన కరణం బలరాం ఆ తర్వాత టీడీపీకి స్వస్తి చెప్పేసి, వైసీపీకి మద్దతు ఇస్తున్నాడు, అయితే అధికారికంగా వైసీపీలోకి పోవటానికి కొన్ని అడ్డంకులు ఉండటంతో తన కొడుకు వెంకటేష్ కు పార్టీ కండువా కప్పించు తాను బయట నుండి వైసీపీ కి మద్దతు ఇస్తున్నాడు.

karanam balaram

 అయితే కరణం వైసీపీ లోకి రావటం ఇష్టంలేని ప్రకాశం జిల్లాకు చెందిన వైసీపీ నేతలు కరణం బలరాం మీద ఒక పద్దతి ప్రకారం వ్యతిరేకమైన వార్తలు స్ప్రెడ్ చేసి, ఆయన్ను ఎలాగైనా వైసీపీకి దూరం చేయాలనీ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా వైసీపీ అనుకూల మీడియాలో అసత్య ఆరోపణలు చేస్తూ, కరణంకు వ్యతిరేకమైన వార్తలు రాయిస్తూ, ఆయన రాక వలన వైసీపీ కి నష్టం కలుగుతుందనే అర్ధం వచ్చేలా కథనాలు వండుతున్నారు. తాజాగా వైసీపీ అంటే కోసుకునే ఒక సైట్ లో వచ్చిన వార్త చూస్తే ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. దసరా,దీపావళి పండగల సందర్భంగా కరణం బలరాం, వెంకటేష్ లతో కూడిన ఒక ప్లెక్సీ ఏర్పాటు చేయటం జరిగింది. ఇందులో వైసీపీకి చెందిన అనేక మంది నేతలు ఉన్నారు , అదే ప్లెక్సీ లో దానిని ఏర్పాటు చేసిన వ్యక్తి ఫోటో కూడా ఉంది.

karanam balaram and venkatesh flexy

 అయితే అందులో ఒక్క కరణం, వాళ్ళ కొడుకు తప్ప మిగతా వాళ్ళందరూ రెడ్డి సామజిక వర్గానికి చెందిన వాళ్లేనని, ఇలాంటి ఫ్లెక్సీ లు వేసి కరణం బలరాం వైసీపీ ని మిగిలిన వర్గాలకు దూరం చేస్తున్నాడని, వైసీపీ లో అంత రెడ్డి రాజ్యమే నడుస్తుందని చెప్పటానికే కరణం బలరాం ఇలాంటి పనులు చేస్తున్నాడని, ఇప్పటికి చంద్రబాబు కోసమే కరణం పనిచేస్తున్నాడని, వైసీపీని కుల పార్టీగా చూపించటానికే ప్లెక్సీ ఏర్పాటు చేశారని ఇష్టం వచ్చిన రీతిలో రాసేశారు . నిజానికి పల్లెటూరిలో నాయకులెవరు డబ్బులు ఇచ్చి, ప్లెక్సీ లు వేపించుకోరు, స్థానిక నేతలు తమ తమ స్థాయిని తెలుపుకోవటానికి, అగ్ర నేతల దృష్టిలో పడటానికి సొంత డబ్బులతో ప్లెక్సీ వేపించి అందులో వాళ్ళ ఫోటోలు పెట్టుకొని పబ్లిసిటీ చేసుకుంటారు. ఆ ఫ్లెక్సీకి అందులోని నేతలకు అసలు సంబంధం ఉండదు.

 గతంలో మహేష్ బాబు జగన్ , తమిళ్ హీరో విజయ్ మరియు జగన్ , అదే విధంగా చంద్రబాబు జగన్ కలిసి వున్నా ప్లెక్సీ లు కూడా అనేకం దర్శనం ఇచ్చాయి. సీఎం జగన్ తో మా ఫోటోలు ఉండాలని మహేష్ బాబు విజయ్ లాంటి వాళ్లే సొంతగా ప్లెక్సీ లు కట్టించుకున్నారా..? జగన్ తాను ఒకే ప్లెక్సీ లో ఉండాలని బాబు ఏమైనా కట్టించుకున్నాడా..? అవన్నీ కూడా ప్రజలు తమ అభిమానంతో కట్టుకునేవి తప్ప, మరోకటి కాదు, కనీసం ఈ పరిజ్ఞానం లేని సదురు సైట్ కరణం బలరాం విషయంలో దిగజారి విమర్శలు చేయటం ఒక కుట్రకోణంలో భాగమే అని సృష్టంగా తెలుస్తుంది.