సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎంతోమంది సంవత్సరాల పాటు కష్టపడినా కూడా అవకాశాలు దొరకవు. కానీ కొంతమంది అదృష్టం కొద్దీ ఓవర్ నైట్ లో స్టార్స్ అయిపోతూ ఉంటారు. ఇలా ఒకే ఒక్క పాటతో ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయిన కండక్టర్ ఝాన్సీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గాజువాక డిపోలో కండక్టర్ గా విధులు నిర్వహిస్తున్న ఝాన్సీ ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో పల్సర్ బైక్ పాటకి అదిరిపోయే స్టెప్పులేసి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఝాన్సీ ఈ ఒక్క పాటతో బాగా ఫేమస్ అవ్వటమే కాకుండా సినిమాలలో అవకాశాలు కూడా అందుకున్నట్లు తెలుస్తోంది .
అయితే ఝాన్సీ చిన్నప్పటి నుండి డాన్స్ మీద తనకి ఉన్న ఇష్టంతో డాన్స్ నేర్చుకొని వివాహం తర్వాత కూడా గాజువాక చుట్టుపక్కల ప్రాంతాలలో జరిగే శుభకార్యాలలో డాన్సులు చేస్తూ ఉండేది. కండక్టర్ గా ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా ఝాన్సీ తన డాన్సులు మాత్రం వదులుకోలేదు. ఇలా తన భర్త ప్రోత్సాహంతో ఒకవైపు కండక్టర్ గా విధులు నిర్వహిస్తూ మరొకవైపు శుభకార్యాలలో డాన్స్ చేస్తూ చుట్టుపక్కల వారికి మాత్రమే తెలిసిన ఝాన్సీ శ్రీదేవి డ్రామా కంపెనీ షో లో ఒక పాటకు డాన్స్ చేయటం వల్ల మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది.
ఇలా పల్సర్ బైక్ పాటతో పాపులర్ అయిన ఝాన్సీ గురించి నెటిజన్స్ ఆరాలు తీస్తున్నారు. ఈ క్రమంలో ఆమెకు సంబంధించిన ఓల్డ్ డాన్స్ వీడియోలను కూడా బయటకు తీసి వాటిని వైరల్ చేస్తున్నారు. ఝాన్సీ గతంలో ఒక కార్యక్రమంలో చేసిన డాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో నందమూరి హరికృష్ణ హీరోగా నటించిన సీతయ్య సినిమాలోని ఒక్క మగాడు అనే పాటకు అదిరిపోయి స్టెప్పులేసి ఆకట్టుకుంది. ఇక ఈ వీడియోలో ఝాన్సీ మెగాస్టార్ వీణ స్టెప్పు కూడా వేసింది. ఇలా ఎంతో అద్భుతంగా డాన్స్ చేసిన ఝాన్సీ ఓల్డ్ వీడియోని ప్రస్తుతం నెటిజన్స్ షేర్ చేస్తూ వైరల్ గా మారుస్తున్నారు.