Cold Symptoms: ప్రస్తుత కాలంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలన్నింటిలో శరవేగంగా వ్యాప్తిచెంది అందరినీ కలవరపెడుతోంది . ప్రస్తుతం ఒమిక్రాన్ కారణంగా ప్రపంచ దేశాలు మళ్లీ లాక్ డౌన్ విధించనున్నాయి . శీతాకాలం వచ్చిందంటే చాలు దగ్గు , జ్వరం , జలుబు వంటి అనారోగ్య సమస్యలు అందరిని వేధిస్తుంటాయి . కానీ ప్రస్తుతం శీతాకాలంలో ఇలాంటి సమస్యలు తలెత్తినా అవి సాధారణ సీజనల్ వ్యాధులా.. లేక ఓమిక్రాన్ లక్షణాల అని భయపడుతున్నారు . వీటి లక్షణాల మధ్య తేడాలను గురించి తెలుసుకుందాం .
సాధారణంగా శీతాకాలంలో వాతావరణ మార్పిడి వల్ల దగ్గు జలుబు జ్వరం గొంతునొప్పి వంటి సమస్యలు మొదలవుతాయి. సాధారణ జలుబు చేసిన వారిలో తుమ్ములు ,బిముక్కు కారడం, ముక్కు రంధ్రాలు మూసుకుపోవడం, గొంతు గరగర,తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి .అప్పుడప్పుడు జలుబు ఎక్కువ అయితే జ్వరం వచ్చి అలసటగా, నీరసంగా ఉంటుంది . ఇవి సాధారణంగా జలుబు చేసినప్పుడు అందరిలో కనిపించే లక్షణాలు .
కానీ ఆమిక్రాన్ సోకిన వారిలో ఇలాంటి లక్షణాలు ఉన్నప్పటికీ వాటిలో చిన్న వ్యత్యాసాలు కనిపిస్తాయి . ఒమిక్రాన్ వచ్చిన వారిలో జలుబు చేసినప్పుడు ముక్కు కారాదు . తీవ్రమైన జ్వరం తో ఇబ్బంది పడుతూ ఉంటారు . ఈ వ్యాధి సోకినవారిలో తలనొప్పి , గొంతు నొప్పి ఎక్కువగా ఉంటాయి . ఒమిక్రాన్ సోకినవారిలో కీళ్ల నొప్పులు ,ఒళ్ళు నొప్పులు అధికంగా ఉంటాయి .
ఒమిక్రాన్ వైరస్ గొంతులో వృద్ధి చెందటం వల్ల నేరుగా గొంతు లేదా ముక్కు ద్వారా ఊపిరితిత్తుల పై దాడి చేస్తుంది . ఈ వ్యాధి సోకిన వారిలో కరోనా వచ్చిన వారి లాగా శ్వాస తీసుకోవటం ఇబ్బందిగా అనిపించదు . కరోనా సోకిన వారి లాగా శరీరంలో ఆక్సిజన్ తగ్గదు . ఏది ఏమైనా ఈ ఒమిక్రాన్ వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండటానికి సరైన నియమాలు పాటించడం మంచిది .