అధికారం చేపట్టిన రోజే రెండున్నర సంవత్సరాల తరువాత క్యాబినెట్ మార్పు ఉంటుందని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఇప్పుడు వైసీపీ నాయకులు ఆ సమయం కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. దాదాపు 90% మందిని క్యాబినెట్ నుండి తప్పిస్తున్నట్టు సమాచారం. అయితే కొంతమంది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తప్పించకూడదని, వారు క్యాబినెట్ లో ఉంటేనే తనకు బలమని భావిస్తున్నారని సమాచారం.
వారిలో నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్. ఆయన మాట్లాడితే కొట్టినట్టు ఉంటుంది. అలాంటి ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఇప్పుడు మంత్రుల్లో అనిల్ కు మాత్రమే ఉంది. అలాగే ఆయనకు మాట్లాడే సబ్జెక్ట్స్ పై కూడా చాలా మంచి గ్రిప్ ఉందని, అలాగే మొన్న పోలవరం విషయంలో ఆయన మాట్లాడిన విధానానికి జగన్ రెడ్డి ఫ్లాట్ అయ్యారని సమాచారం.
కాబట్టి అనిల్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ క్యాబినెట్ నుండి తప్పించేది జగన్ భావిస్తున్నారని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. అయితే మొదట నెల్లూరులో రెడ్డి సామాజిక వర్గాన్ని అణిచివెయ్యడానికి అనిల్ మీద వార్తలు వచ్చాయి. అప్పుడు అందరూ అనిల్ క్యాబినెట్ లో ఉండరని భావించారు . కానీ జగన్ మాత్రం అవన్నీ పట్టించుకోకుండా అనిల్ ను క్యాబినెట్ లోనే ఉంచుతున్నారని సమాచారం.
అలాగే కృష్ణా జిల్లాకు చెందిన కొడాలి నాని విషయంలోనూ జగన్ చాలా పాజిటివ్‌గా ఉన్నారని అంటున్నారు. సభలోను, బయటా కూడా ప్రతిపక్షంపై దూకుడు ప్రదర్శించే నాయకుల్లో ఆయన ముందున్నారు. చంద్రబాబును నేరుగా అరెయ్.. ఒరెయ్.. అనడం ద్వారా ఆయన మార్కు రాజకీయాలు ప్రదర్శించారు. పైగా కమ్మ వర్గంలో నాని ముందు నుంచే జగన్ వెంట నడిచారు. కాబట్టి నానిని కూడా క్యాబినెట్ నుండి తప్పించే అవకాశం లేదని తెలుస్తుంది.
మొదట్లో నాని మళ్లాడే విధానంపై వైసీపీ నేతలు అడ్డు చెప్పారు. కానీ ఆయన మాటలు వైసీపీ కార్యకర్తల్లో ఉత్సహం నింపుతుండటంతో నాని జగన్ కు నచ్చారు. ఆలాగే ఆయన పార్టీ కోసం ఎంతో కష్టపడుతున్నారు. అలాంటి నేత తన పక్కన ఉండాలని జగన్ రెడ్డి భావిస్తున్నట్టు సమాచారం.