ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఎప్పుడు చూసిన చాలా హాట్ హాట్ గా ఉంటాయి. టీడీపీ, వైసీపీ పార్టీలు ఎప్పుడు ఒకరిపై ఒకరు ఎత్తులు పైఎత్తులు వేసుకుంటూ ప్రజలకు. చేరువ అవ్వడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. 2019 ఎన్నికల్లో టీడీపీని ఘోరంగా ఓడించిన వైసీపీ, మళ్ళీ టీడీపీ తెరుకోకుండా దెబ్బకొట్టడానికి విశ్వప్రయత్నాలు చేస్తుంది. అలాగే ఇప్పుడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కర్నూల్ జిల్లాపై ప్రత్యేకమైన దృష్టిని పెట్టారు. 2019 ఎన్నికల్లో కర్నూల్ లో టీడీపీని చిత్తుగా ఓడించిన జగన్, భవిష్యత్ లో ఎప్పుడూ కర్నూల్ లో టీడీపీని తెరుకోకుండా చెయ్యడానికి వ్యూహం రచిస్తున్నారు.
కర్నూల్ ను కడపగా మార్చనున్న జగన్
కర్నూల్ జిల్లాలో ఇప్పటికే బలంగా ఉన్న వైసీపీ మరింత బలపడడానికి రచించిన వ్యూహమే ఈ జిల్లాల విభజన. కర్నూల్ జిల్లాను మూడు జిల్లాలుగా విభజించడానికి జగన్ పతకం రచిస్తున్నారు. కర్నూల్ జ్యూడిషల్ రాజధానిగా చెయ్యడం వల్ల కర్నూల్ ప్రజల్లో మంచి పేరును సంపాదించుకున్న జగన్ ఇప్పుడు మూడు రాజధానుల విషయంతో మరింత బలపడి టీడీపీని దెబ్బకొట్టనున్నారు. కడపలో ఎలాగైతే వైసీపీ బలంగా ఉందొ ఇప్పుడు కర్నూల్ లో కూడా అంతే బలపడటానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
మూడు జిల్లాలుగా మారనున్న కర్నూల్
పత్తికొండ, ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయంతో కలిపి ఆదోనిని జిల్లా చేయాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడి ప్రజలను శాంత పరిచేందుకు, ఓటు బ్యాంకును తనకు అనుకూలంగా మార్చుకు నేందుకు ప్రయత్నిస్తోంది. అదే సమయంలో నందికొట్కూరు, కర్నూలు, డోన్, కోడుమూరులను కలిపి కర్నూలు జిల్లాగా ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. శ్రీశైలం, నంద్యాల, ఆళ్లగడ్డ, బనగానపల్లె, పాణ్యం నియోజకవర్గాలతో కలిపి నంద్యాల జిల్లా ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. వీటిలో రెండు పార్లమెంటు నియోజకవర్గాలు ఉండగా ఇప్పుడు మూడు జిల్లాల ఏర్పాటు దిశగా కసరత్తు ముమ్మరం చేస్తున్నారు. ఇలా జిల్లాలుగా విభజించి మరీ టీడీపీని దెబ్బకొట్టడానికి జగన్ రచిస్తున్న పతకాన్ని టీడీపీ నాయకులు ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాలి.