Home Andhra Pradesh ఆ విషయంలో మోడీతో పోటీపడుతున్న సీఎం జగన్.. హేమాహేమీలే వెనకడుగు

ఆ విషయంలో మోడీతో పోటీపడుతున్న సీఎం జగన్.. హేమాహేమీలే వెనకడుగు

 విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా పనిచేస్తూ పరిపాలన పరంగా పెద్దగా అనుభవం లేకపోయిన కానీ, తనదైన పథకాలతో ప్రజా సంక్షేమ పాలన అందిస్తున్న సీఎం వైఎస్ జగన్ కు ప్రజాదరణ రోజు రోజుకు పెరిగిపోతుంది. కేవలం ఆంధ్ర లో మాత్రమే కాదు దేశ వ్యాప్తంగా వైఎస్ జగన్ క్రేజ్ పెరగటం విశేషం, తాజాగా విడుదలైన ‘చెక్‌బ్రాండ్స్‌’ సంస్థ నివేదికలో ఈ విషయం తేటతెల్లం అయ్యింది.

Cm Jagan Modi

 ఆగస్ట్‌ నుంచి అక్టోబర్‌ వరకు సోషల్‌ మీడియా టాప్‌ ట్రెండ్స్‌ను ‘చెక్‌బ్రాండ్స్‌’ విడుదల చేసింది. 95 మంది టాప్‌ పొలటికల్‌ లీడర్లు, 500 మంది అత్యున్నత ప్రభావశీలురకు సంబంధించిన ట్రెండ్స్‌ను చెక్‌బ్రాండ్స్‌ విశ్లేషించింది. దాదాపు 10 కోట్ల ఆన్‌లైన్‌ ఇంప్రెషన్స్‌ ఆధారంగా ఈ తొలి నివేదికను వెలువరించింది. ట్విటర్, గూగుల్‌ సెర్చ్, వికీ, యూట్యూబ్‌ల్లో అత్యధిక ట్రెండ్స్‌ ప్రధాని మోదీ పేరుపైననే ఉన్నాయని పేర్కొంది.

 ఈ నివేదిక ప్రకారం.. 2,171 ట్రెండ్స్‌తో మోదీ తొలి స్థానంలో నిలవగా.. మోదీకి అత్యంత సమీపంగా 2,137 ట్రెండ్స్‌తో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి రెండో స్థానంలో నిలిచారు. తదుపరి స్థానాల్లో పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీ ఉన్నారు. అధికారం చేపట్టిన కొద్దీ రోజుల్లోనే దేశంలోనే టాప్ బ్రాండ్ కలిగిన నేతగా వైఎస్ జగన్ నిలవటం అనేది చాలా గొప్ప విషయమనే చెప్పుకోవాలి. మమతా బెనర్జీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ లాంటి నేతలు రాజకీయంగా తలపండిన వాళ్ళు, దేశ స్థాయిలో క్రేజ్ కలిగిన నేతలు అలాంటి వాళ్ళను వెనక్కి నెట్టి సీఎం జగన్ ముందు వరసలో రావటం జగన్ కు పెరుగుతున్న ఆదరణకు నిదర్శనం అనే చెప్పాలి.

 ఈ విధంగా సోషల్ మీడియాలో జగన్ టాప్ ట్రాండ్ లో ఉండటానికి అనేక కారణాలు లేకపోలేదు. ఆయన చేస్తున్న సంక్షేమ పధకాలు ఒక వైపు ఉంటే మరోపక్క మాత్రం సీఎం జగన్ సుప్రీంకోర్టు జస్టిస్ విషయంలో తీసుకున్న నిర్ణయం కావచ్చు, రాష్ట్ర హైకోర్టు జడ్జీల విషయంలో అనుసరిస్తున్న ధోరణి కావచ్చు, దేశ వ్యాప్తంగా సీఎం జగన్ గురించి మాట్లాడుకునే విధంగా చేశాయని చెప్పవచ్చు. మొదటి నుండి సోషల్ మీడియా విషయంలో సీఎం జగన్ అధిక ప్రాధాన్యత ఇచ్చే వాడు. 2019 ఎన్నికల్లో జగన్ సీఎం కావటానికి సోషల్ మీడియా కు ఒక ఒక ప్రధాన కారణమనే చెప్పుకోవాలి. దానిని నిజం చేస్తూ తాజాగా విడుదలైన ‘చెక్‌బ్రాండ్స్‌’ నివేదికలో దేశంలోనే నెంబర్ 2 ట్రెండ్స్ కలిగిన నేతగా నిలిచాడు. ఇక ఈ వార్త రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అభిమానులకు అధిక సంతోషాన్ని ఇచ్చిందనే చెప్పాలి. ఇప్పటికే ఈ విషయాన్నీ సోషల్ మీడియాలో హైలైట్ చేస్తూ ట్రేండింగ్ చేసే పనిలో ఉన్నారు.

 

- Advertisement -

Related Posts

కొడుకు కెరీర్ ని రిస్క్ లో పెడుతోన్న బెల్లం కొండ సురేశ్ ?

బెల్లంకొండ శ్రీనివాస్ రీసెంట్ గా అల్లుడు అదుర్స్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. నాలుగు సినిమాలతో పోటీ పడి మరీ తన సినిమా మీద ఉన్న నమ్మకంతో సంక్రాంతి బరిలో...

దిల్ రాజు – శిరీష్ ల భజన ప్రోగ్రామ్ షురూ.

దిల్ రాజు నిర్మాతగా.. డిస్ట్రిబ్యూటర్ గా టాలీవుడ్ లో ఎంత పాపులర్ అన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గతకొంతకాలంగా దిల్ రాజు టాలీవుడ్ లో నిర్మాతగాను డిస్ట్రిబ్యూటర్ గాను లీడ్ లో ఉన్నాడు....

చిరంజీవి ఆచార్య సినిమాలోకి రాజమౌళి ? వామ్మో ఇది మామూలు రచ్చ కాదు ..?

చిరంజీవి - కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా ఆచార్య. సక్సస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రాం చరణ్ ఈ...

రాజకీయాల్లో రామ్మోహన్ రాజకీయం డిఫరెంట్, జగన్ కూడా కంగారుపడేలా

గత ఎన్నికల్లో టీడీపీ తరపున గెలుపొందింది ముగ్గురే ముగ్గురు ఎంపీలు.  వారిలో యువకుడు కింజారపురామ్మోహన్ నాయుడు.  ఎర్రన్నాయుడు వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన రామ్మోహన్ నాయుడు సీనియర్లకు మించి పోరాటం చేస్తున్నారు.  యువకుడు కావడం,...

Latest News