TG: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో భాగంగా నిజామాబాద్ సభలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన బిఆర్ఎస్, బిజెపి పై తీవ్రస్థాయిలో విమర్శల వర్షం కురిపించారు. కేసిఆర్ గత ఎన్నికలలో ఓడిపోవడంతో అసెంబ్లీకి రాకుండా ఫామ్ హౌస్ లో కూర్చుని రాజకీయ కుట్రలు చేస్తున్నారని మాపై విమర్శలు చేస్తున్నారు అంటూ రేవంత్ ఫైర్ అయ్యారు.
ప్రజలు వారిని విమర్శించిన మార్పు రాకుండా, పార్టీ పేరు మార్చుకున్నారంటూ ఎద్దేవా చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్‌ను ఎందుకు అరెస్టు చేయడం లేదని బండి సంజయ్ ప్రశ్నిస్తున్నారని, కానీ, అసలు కేటీఆర్ అరెస్ట్‌ను అడ్డుకుంటున్నది బీజేపీయేనని వెల్లడించారు. కేటీఆర్ అరెస్టు కాకుండా బిజెపితో చేతులు కలిపినట్లు రేవంత్ ఆరోపణలు చేశారు.
విదేశాలలో ఉన్నటువంటి ప్రభాకర్ రావు,శ్రవణ్ రావులను భారత్‌కు రప్పిస్తే, 24 గంటల్లోనే కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తాం. కానీ, బీజేపీ కేటీఆర్‌ను రక్షించే ప్రయత్నం చేస్తోందని కేటీఆర్ అరెస్ట్ కు బిజెపి అండగా ఉంది అంటూ రేవంత్ రెడ్డి తెలిపారు..ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను బీజేపీ బ్లాక్‌మెయిల్ చేస్తోంది. ఇలా ఈ రెండు పార్టీలో కలిసిపోవడంతోనే ఎమ్మెల్సీ ఎన్నికలలో బీఆర్ఎస్ పోటీ చేయలేదని తెలిపారు.
ఇలా ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేయలేని వారు ఉప ఎన్నికలు వస్తే గెలుస్తారా అంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు గత పది సంవత్సరాల కాలంలో కేసీఆర్ ఎప్పుడూ కూడా ఉప ఎన్నికల గురించి మాట్లాడలేదు కానీ ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తాయి అంటూ మాట్లాడుతున్నారు అలా ఎందుకు మాట్లాడుతున్నారో కూడా వారే చెప్పాలి అంటూ రేవంత్ రెడ్డి ప్రతిపక్ష పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు కురిపిస్తూ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనగా మారాయి.