తెలంగాణ రాష్ట్రంలో మునుగోడు ఉపఎన్నిక దిశగా అడుగులు పడుతుండటంతో కేసీఆర్ టెన్షన్ పడుతున్నారు. మునుగోడు ఉపఎన్నిక జరిగితే టీఆర్ఎస్ కు అనుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు అయితే తక్కువని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే మునుగోడు ఉపఎన్నిక కంటే ముందే అసెంబ్లీని రద్దు చేయాలని కేసీఆర్ భావిస్తున్నారని సమాచారం అందుతోంది. మునుగోడు ఉపఎన్నికపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టడం గమనార్హం.
తెలంగాణలో ఏ ఎమ్మెల్యే అయినా బీజేపీ కోసం రాజీనామా చేస్తే ఉపఎన్నికలో గెలిపిస్తామని బీజేపీ నుంచి రాజీనామా చేసిన ఎమ్మెల్యేలకు భరోసా లభిస్తుండటం గమనార్హం. హుజూరాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ ఎన్నో హామీలుఇచ్చినా ఆ పార్టీకి ఓటమి ఎదురైంది. ఈ ఉపఎన్నిక వల్ల కేసీఆర్ దళిత బంధు అనే పథకాన్ని అమలులోకి తెచ్చారనే సంగతి తెలిసిందే. హుజూరాబాద్ ఫలితం నేపథ్యంలో రిస్క్ తీసుకోవడానికి కేసీఆర్ సిద్ధపడటం లేదు.
నల్గొండ, ఖమ్మం జిల్లాలలో బీజేపీకి బలం లేదు. అయితే బలం లేని నల్గొండలో జరిగే ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటితే సాధారణ ఎన్నికల్లో సైతం బీజేపీకి అనుకూల ఫలితాలు వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. మరోవైపు బండి సంజయ్ బహిరంగంగా 12 ఉపఎన్నికలు జరిగే అవకాశం ఉందని వెల్లడించిన సంగతి తెలిసిందే. ఉపఎన్నికల ద్వారా బీజేపీ విసిరే సవాళ్లను తట్టుకోవడం కష్టమని కేసీఆర్ భావిస్తున్నారని సమాచారం అందుతోంది.
బీజేపీ, కాంగ్రెస్ నేతలు సైతం కేసీఆర్ ముందస్తు ఎన్నికల దిశగా అడుగులు వేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం అయితే ఉందని సమాచారం అందుతోంది. అమిత్ షా సైతం తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పారని సమాచారం అందుతోంది. తెలంగాణలో ముందస్తు ఎన్నికల దిశగా అడుగులు పడితే బీజేపీ, కాంగ్రెస్ కు భారీ షాక్ తప్పదని చెప్పవచ్చు.