సీబీఐకి సీఎం కేసీఆర్ బిగ్ షాక్? బీజేపీని ఎదుర్కోవడం కోసమేనా?

cm kcr big shock to cbi

సీబీఐకి సీఎం కేసీఆర్ బిగ్ షాక్ ఇవ్వనున్నారా? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. సీబీఐకి తెలంగాణలో ఉన్న సాధారణ సమ్మతిని రద్దు చేయాలని కేసీఆర్ భావిస్తున్నారట. భవిష్యత్తులో సీబీఐ నుంచి వచ్చే సమస్యలను ఎదుర్కోవడం కోసం.. బీజేపీ పార్టీ నుంచి వచ్చే చిక్కులను ఎదుర్కోవడం కోసమే.. సీఎం కేసీఆర్ త్వరలో సీబీఐకి బిగ్ షాక్ ఇవ్వబోతున్నట్టు పొలిటికల్ సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి.

cm kcr big shock to cbi
cm kcr big shock to cbi

ఇప్పటికే సీబీఐకి ఉన్న సాధారణ సమ్మతిని కొన్ని రాష్ట్రాలు రద్దు చేశాయి. రాష్ట్రాల అంశాల్లో సీబీఐ ఇన్వాల్వ్ అవుతూ.. కేంద్రం చెప్పినట్టు చేస్తూ.. రాష్ట్రాల్లో లేనిపోని సమస్యలను తెస్తోందని.. కొన్ని రాష్ట్రాలు తమ రాష్ట్రానికి సీబీఐ రాకుండా అడ్డుకట్ట వేశాయి.

అయితే.. తెలంగాణలో మాత్రం ప్రస్తుతానికి సీబీఐ వల్ల కేసీఆర్ కు కానీ.. తన పార్టీకి కానీ ఎటువంటి ఇబ్బంది లేదు. అందుకే.. ఆయన సీబీఐని అడ్డుకోవడం లేదు. కానీ.. భవిష్యత్తులో ఖచ్చితంగా బీజేపీ నాయకుల నుంచి టీఆర్ఎస్ పార్టీకి, తెలంగాణ ప్రభుత్వానికి, కేసీఆర్ కు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఆయన్ను ఇరుకున పెట్టే ప్రయత్నం బీజేపీ ఖచ్చితంగా చేస్తుంది. ఇప్పటికే తెలంగాణలో బీజేపీ కేసీఆర్ ను టార్గెట్ చేసింది. ఈనేపథ్యంలో.. తన మీద ఎక్కడ కేంద్రం.. సీబీఐని ఉసికొల్పుతుందో అని భావించిన కేసీఆర్.. త్వరలోనే సీబీఐని రాష్ట్రానికి రాకుండా అడ్డుకోవడానికి ప్లాన్ వేస్తున్నారట.

పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో సీబీఐ సాధారణ సమ్మతిని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేశాయి. గతంలో ఏపీలో కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సీబీఐ సాధారణ సమ్మతిని రద్దు చేశారు. కేరళలోనూ ప్రస్తుతం సీబీఐకి ఎంట్రీ లేదు. అందుకే.. తెలంగాణలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో ఈ నిర్ణయం తీసుకోనున్నారట. రాష్ట్ర సమస్యలతోనే సతమతమవుతున్న నేపథ్యంలో బీజేపీ నుంచి వచ్చే ఒత్తిడిని తట్టుకోవాలంటే సీబీఐకి అడ్డుకట్ట వేయాలని సీఎం భావిస్తున్నట్టు తెలుస్తోంది.