తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకునే సంచలన నిర్ణయాలు ఎలా ఉంటాయో ? ఎవరూ ఊహించలేరు. కేసీఆర్ పై నియంత పోకడనే విమర్శలున్నప్పటికీ ఆయన తీసుకొచ్చే చట్టాలు మాత్రం షాకింగ్ గానే ఉంటాయి. ఇటీవలే కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. బూజు పట్టిన రెవెన్యూ చట్టాని ప్రక్షాళన చేసి సరికొత్త చట్టాన్ని ప్రజల ముందుకు తీసుకొ చ్చారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు విమర్శించినప్పటికీ ఎక్కడో? కొత్త చట్టంతో న్యాయం జరుగుతుందనే భద్రతా భావం ప్రజల్లో ఏర్పడుతోంది. మరి ఈ చట్టం పనితీరు ఎలా? ఉంటుందన్ని ముందు ముందున తెలుస్తుంది.
తాజాగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గ్రేటర్ హైదరాబాద్ జీహెచ్ ఎంసీ అక్రమ హోర్డింగ్ లపై కొరడా ఝుళిపించింది. అధికారులు భారీ పైన్లతో విరుచుకుపడ్డారు. పలుమార్లు హెచ్చరించినా మాట వినకపోవడంతోనే భరత్ అనే నేను సినిమాలో మహేష్ బాబులా జీవో ఇవ్వాల్సి వచ్చిందన్న మాట వినిపిస్తోంది. అమీర్ పేటలోని చెన్నై షాపింగ్ మాల్ కు 4 లక్షలు జరిమానా, వీర్కే సిల్స్ కు 2 లక్షలు, ఎస్ ఆర్ నగలర్ లోని బజాజ్ ఎలక్ర్టానిక్స్ కు 50 వేలు, అక్కడే ఉన్న రియలన్స్ డిజిటల్స్ లక్ష, ఇంపీరియల్ రెస్టారెంట్ కు లక్ష రూపాయలు ఫైన్లగా విధించి డెడ్ లైన్ విధించారు. దీంతో ఆ కంపెనీ యాజమాన్యాలు షాక్ తిన్నాయి.
ఎప్పుడూ లేని లక్షల రూపాయల ఫైన్లు? ఏంటని అధికారుల్ని ప్రశ్నించే సరికి ఇదంతా సీఎం సాబ్ అదేశాలు…ఏదైనా చెప్పాలంటే చట్ట పరంగా వెళ్లాల్సిందేనని తేల్చి చెప్పేసారుట. చట్టాలతో పెట్టుకుంటే తేలే వ్యవహారం కాదని భావించిన సదరు యాజమాన్యాలు చేసేదేం లేక జీహెచ్ ఎంసీ విధించిన ఫైన్లు కట్టడానికే సిద్దమైనట్లు సమాచారం. వాస్తవానికి ఇలాంటి అక్రమ హోర్డింగ్ లు తొలగించాలని..ఇలాంటి వాటి కారణంగా వాహనదారులకు ఇబ్బంది కరంగా ఉంటుందని భావించి కొన్నాళ్ల క్రితమే ఉన్న వాటిని తొలగించాలని..కొత్తవి ఏర్పాటు చేయకూడదని అధికారులు ఆదేశించారు. కానీ ఆదేశాలను పెడ చెవిన పెట్టి ఇప్పుడిలా లాక్ అయ్యారు.