రవిప్రకాశ్.. అరె ఈ పేరు ఎక్కడో విన్నట్టుందే అంటారా? తెలుగు మీడియా గురించి కాసింతైనా అవగాహన ఉన్నవాళ్లకు ఈ పేరు సుపరిచితమే. టీవీ9 అనే సామ్రాజ్యాన్ని నిర్మించింది ఈయనే. టీవీ9 ప్రారంభం అయినప్పటి నుంచి కూడా రవిప్రకాశ్ పై ఎన్నో ఆరోపణలు. తనపై ఎన్ని ఆరోపణలు వచ్చినా.. టీవీ9ను నెంబర్ వన్ న్యూస్ చానెల్ గా తీర్చిదిద్దడంలో సక్సెస్ అయ్యాడు రవిప్రకాశ్. అదంతా పాత కథ. ఇప్పుడు రవి ప్రకాశ్ టీవీ9లో లేడు. కనీసం ఆయన మోజో టీవీ కూడా లేదు. ఇటీవలే జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. కానీ.. ఇప్పుడు ఏం చేయాలి? ఇంకో చానెల్ పెట్టాలా? లేక వేరే చానెల్ కు పోవాలా? ఇలాంటి కన్ఫ్యూజన్ మధ్య.. రవిప్రకాశ్ ఏకంగా రాజ్ న్యూస్ చానెల్ లో చేరిపోయాడు.
రాజ్ న్యూస్ అనే చానెల్ ఎప్పటి నుంచో ఉంది. కానీ.. చాలామందికి అటువంటి చానెల్ ఉన్నట్టు తెలియదు. అది బీజేపీ చానెల్ అని అంటున్నారు. ఆ చానెల్ లో కన్సల్టింగ్ ఎడిటర్ గా రవిప్రకాశ్ జాయిన్ అయ్యాడట. ఆయనతో పాటు.. ఆయన వెనుక ఉండే టీమ్ కూడా రాజ్ న్యూస్ లో చేరిందట.
అసలు.. రవిప్రకాశ్.. ఓ అనామక చానెల్ లో చేరడం వెనుక ఉద్దేశం ఏంటో ఇప్పటికే అర్థం అయి ఉంటుంది జనాలకు. రవిప్రకాశ్ కు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. కేసీఆర్ కు, బీజేపీకి పడదు. అందుకే.. కేసీఆర్ ను దెబ్బకొట్టాలంటే బీజేపీతో చేతులు కలపాలి. ప్రస్తుతం రవిప్రకాశ్ చేసిన పని అదే.
తెలంగాణలో ప్రస్తుతం ఉన్న న్యూస్ చానెళ్లలో 90 శాతం పింక్ చానెళ్లే. ఒకటో రెండో పింక్ చానెళ్లు కావు కానీ.. అంతగా… తెలంగాణ ప్రభుత్వం మీద యాంటీ స్టోరీలు వేసేంత సీన్ అయితే లేదు. అంటే.. తెలంగాణలో ఖచ్చితంగా కేసీఆర్ యాంటీ చానెల్ రావాల్సిందే అని అనుకున్నారో ఏమో.. రవిప్రకాశ్.. రాజ్ న్యూస్ లో తన కార్యచరణను ప్రారంభించేశాడు.
వెంటనే… తెలంగాణ ప్రభుత్వం యాంటీ స్టోరీలు రావడం ప్రారంభం అయ్యాయి రాజ్ న్యూస్ లో. దీంతో ఒక్కసారిగా టీఆర్ఎస్ క్యాంపులో కలకలం స్టార్ట్ అయిందట. కేసీఆర్ కూడా కొంచెం ఉలికిపడ్డారని సమాచారం. చూద్దాం మరి… ఈ రాజ్ న్యూస్ కథ ఎంతవరకు వెళ్తుందో?