ఒక పదేళ్ల అలుపెరుగని కష్టంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కు సీఎం అయ్యారు. గత ఎన్నికల్లో వైసీపీలో చాలామంది నేతలు కేవలం జగన్మోహన్ రెడ్డి ఫోటోను అడ్డుపెట్టుకొని గెలిచిన వారు ఉన్నారు. వైసీపీలో ఉన్న ప్రతీఒక్క నాయకుడి కోసం జగన్ కష్టపడ్డారు గెలిపించుకున్నారు, పదవి చేపట్టాడు కానీ పదవి చేపట్టిన తరువాత జగన్ లో వచ్చిన మార్పులు వైసీపీలో కలకలం సృష్టిస్తున్నాయి. ఆ మార్పులను చూసి వైసీపీలో కీలక నేతలు కూడా ఆశ్ఛర్యపోతున్నారు. ఇంకొంతమంది చాలా బాధపడుతున్నారు. ఆ నేతలు తమ బాధను ఎవరికి చెప్పుకోవాలి తెలియక తమలో తామే మదన పడుతున్నారు.
జగన్ వచ్చిన మార్పు ఏంటి!!
అధికారంలోకి రావడానికి ముందు వైసీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు జగన్మోహన్ రెడ్డి కూడా ఎప్పుడు ప్రజల్లో ఉండేవారు. అధికారంలో ఉన్నవారు తప్పుచేస్తే ప్రశ్నించడానికి ముందుండేవారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత పూర్తిగా ప్రజలకు దూరంగా ఉన్నారు. కనీసం ప్రజాప్రతినిధులను కూడా కలవడానికి అనుమతి ఇవ్వడం లేదు. ఇలా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు జగన్ దూరంగా ఉండటం అనేది రానున్న రోజుల్లో వైసీపీకి ఇబ్బందులకు న్దారి తియ్యనున్నాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఇప్పటికే అనేకమంది నాయకులు జగన్ కు ఈ విషయమై ఫిర్యాదు చేసినప్పటికీ జగన్ మాత్రం పట్టించుకోవడం లేదు.
వైసీపీకి మళ్ళీ ప్రశాంత్ కిషోర్ అవసరం పడిందా!!
గత ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించడానికి ఉన్న కారణాల్లో ప్రశాంత్ కిషోర్ ఒకరు. ఆయన వేసిన రాజకీయ వ్యూహాలు, ఎత్తుగడలు వల్లే జగన్ గాని వైసీపీ నాయకులు గాని విజయం సాధించారు. అయితే ఇప్పుడు అధికారంలో వచ్చి దాదాపు 16 నెలలు కావొస్తుంది. ప్రభుత్వం తీసుకున్న దాదాపు అన్ని నిర్ణయాలు కోర్ట్ ల చుట్టూ తిరగడం, మూడు రాజధానుల నిర్ణయం వల్ల, వైసీపీ నాయకులు కక్ష్యపూరిత రాజకీయాల వల్ల, జగన్ ప్రవర్తనలో మార్పు వల్ల వైసీపీపై ప్రజల్లో ఖచ్చితంగా వ్యతిరేకత మొదలైంది. కానీ ఆ వ్యతిరేకత ఈ స్థాయిలో ఉందన్నది తెలియడం లేదు. ఇప్పుడు ఆ విషయాన్ని తెలుసుకోవడానికి వైసీపీకి మళ్ళీ ప్రశాంత్ కిషోర్ యొక్క అవసరం పడిందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నాయకులు మళ్ళీ ప్రశాంత్ కిషోర్ ను ఆశ్రయిస్తారో లేదో వేచి చూడాలి.