వైఎస్ జగన్.. ఏపీ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కేంద్రంలో బీజేపీతో సఖ్యతతోనే ఉంటున్నారు. ఎందుకంటే.. కొత్త రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా కేంద్రం అవసరం ఎంతైనా ఉంది. కేంద్రం పట్టించుకుంటేనే కొత్త రాష్ట్రం తొందరగా అభివృద్ధి చెందుతోంది. అందులోనూ కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన ఎన్నో హామీలు పెండింగ్ లో ఉన్నాయి. వాటి కోసమైనా కేంద్రంతో మంచిగా ఉండాలనేది జగన్ సిద్ధాంతం.
చాలాసార్లు కేంద్ర ప్రభుత్వానికి.. వైఎస్ జగన్ కానీ.. వైసీపీ కానీ మద్దతు ఇస్తూ వచ్చారు. చాలాసార్లు ఢిల్లీ వెళ్లారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలను కూడా కలిశారు. ఇటీవల కూడా ఢిల్లీ వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. ప్రధాని మోదీతో కూడా భేటీ అయ్యారు. ఆ తర్వాతనే జస్టిస్ రమణపై సీజేఐకి లేఖలు రాశారు జగన్.
సరే.. అవన్నీ అందరికీ తెలిసినవే. కానీ.. ప్రస్తుతం ఆంధ్రా రాజకీయాల్లో జోరుగా సాగుతున్న చర్చ ఒకటే. అదే మరోసారి వైఎస్ జగన్.. ప్రధాని మోదీని కలవబోతున్నారని. అందులో వింతేమీ లేదు కానీ.. ఆయన ఈసారి ఒక్కరుగా కాకుండా.. తన భార్యతో సహా.. సతీసమేతంగా ప్రధాని మోదీని కలవనున్నారట. ఇప్పటికే ప్రధాని మోదీ అపాయింట్ మెంట్ కూడా తీసుకున్నారట.
అసలు.. ప్రధాని మోదీతో సతీసమేతంగా ఎందుకు జగన్ కలవబోతున్నారు? ఇంతకీ ఇది నిజమేనా? అబద్ధమా? అనే విషయం మాత్రం తెలియడం లేదు. ప్రస్తుతం ఈ టాపికే ఆంధ్రాలో హాట్ టాపిక్ గా మారింది.
సోషల్ మీడియాలో మాత్రం ఈ ప్రచారం జోరుగా సాగుతున్నప్పటికీ.. వైసీపీ వర్గాలు మాత్రం అదేం లేదు.. సీఎం జగన్.. అసలు ఢిల్లీనే వెళ్లడం లేదు. సతీసమేతంగా అస్సలు వెళ్లడం లేదు.. కావాలని సోషల్ మీడియాలో ఎవరో చేస్తున్న దుష్ప్రచారం ఇది.. అంటూ వైసీపీ వర్గాలు వెల్లడించాయి.