సాయంత్రం ప్రధాని మోదీతో భేటీకానున్న సీఎం జగన్..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దావోస్ నుండి తిరిగి వచ్చాక ఢిల్లీ పర్యటన చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ భాగంలో ఆయన ప్రధాని నరేంద్ర మోదీ తో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. గురువారం మధ్యాహ్నం గన్నవరం నుంచి బయలుదేరగా కాసేపటి క్రితమే ఢిల్లీ చేరుకున్నారు.

ఇక ఈయన సాయంత్రం 4.30 నిమిషాలకు ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న విషయాల గురించి చర్చలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత హోం శాఖ మంత్రి అమిత్ షా ను కూడా భేటీ కానున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి రాష్ట్రంకు సంబంధించిన విషయంలో వైయస్ జగన్ చాలా బిజీగా ఉన్నాడు.