విశాఖలో టీడీపీ పునాదులు పెకలిస్తున్న జగన్

YS Jagan

 జగన్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన నాటి నుండి ముఖ్యంగా రెండు పనులను సమాంతరంగా చక్కబెడుతూ ముందుకి వెళ్తున్నాడు. అందులో ముఖ్యమైంది ప్రజలకు అందించే సంక్షేమ పధకాలు, రెండోది టీడీపీ పార్టీ యొక్క ఆర్థిక పునాదులను పెకలించి వేయటం. మొదటి పని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జగన్ ప్రభుత్వం అంటేనే ప్రజా సంక్షేమ ప్రభుత్వం అన్నట్లు మారిపోయింది. ఇక రెండో విషయం టీడీపీ ఆర్థిక పునాదులను పెకిలించి వేయటం.

jagan and cbn telugu rajyam

 రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అమరావతిని రాజధానికి గా చంద్రబాబు ప్రకటించటంతో, ఆయన వర్గానికి చెందిన నేతలు, టీడీపీ కి ఆర్థిక వనరులు అందించే వర్గం రాజధానికి చుట్టూ పక్కల కొన్ని వేల కోట్లు విలువచేసే భూములు కొన్నారు. ఇక జగన్ సీఎం అయినా తర్వాత టీడీపీ ఆర్థిక మూలాలన్ని ఎక్కువగా అమరావతిలోనే ఉండటంతో గట్టి దెబ్బ కొట్టాలనే ఉద్దేశ్యంతో రాజధానిని తరలింపు పక్రియ చేపట్టాడు. దీనితో టీడీపీ నేతల్లో వణుకు మొదలైంది. బాబును చూసుకొని కోట్ల డబ్బును తీసుకొనివెళ్ళి అమరావతిలో పెడితే ఇప్పుడు జగన్ వచ్చి ఆ డబ్బుకు విలువలేకుండా చేసి కృష్ణ లో నిలువునా ముంచేయటంతో టీడీపీ ఆర్థిక మూలాలు చాలా వరకు దెబ్బతిన్నాయి.

 ఇక విశాఖ రాజధాని కావటంతో అక్కడ టీడీపీ ఆర్థిక శక్తులను గుర్తించి వాటిని నిర్వీర్యం చేయాలనీ జగన్ సర్కార్ యోచిస్తుంది. ఇందులో భాగంగా టీడీపీ బిగ్ షాట్స్ ను సెలెక్ట్ చేసుకొని వాళ్ళ లొసుగులను బయటకు తీసేపనిలో పడింది. ఎంవీవీఎస్ మూర్తి విశాఖలో టీడీపీ కి బలమైన ఆర్థిక శక్తి,, టీడీపీ తరుపున రెండు సార్లు ఎంపీ గా పోటీచేశాడు. విశాఖ ప్రాంతంలో ఆర్థికంగా A1 స్థానంలో ఉన్నాడు, గతంలో విశాఖ ప్రాంతంలో ఎలాంటి ఎన్నికలు జరిగిన కానీ, మూర్తి నుండి ఆర్థిక సహాయం టీడీపీ కి గట్టిగానే అందేది. ఈ మధ్య కాలంలో ఆయన చనిపోవటంతో, గీతం యూనివర్సిటీ బాధ్యతలు, మూర్తిగారి రాజకీయ వారసత్వం రెండు కూడా ఆయన మనవడు, బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ చూసుకుంటున్నాడు.

bharat telugu rajyam

  మొన్నటి ఎన్నికల్లో భరత్ విశాఖ ఎంపీగా బరిలో నిలిచాడు. ఆ పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజక వర్గాల్లో పోటీచేస్తున్న టీడీపీ నేతలకు భరత్ భారీగానే ఆర్థిక సహాయం అందించినట్లు సమాచారం. ఈ విధంగా మూర్తి దగ్గర నుండి ఆయన మనవడి వరకు అందరు టీడీపీ కి ఆర్థిక సహాయం చేసిన వాళ్లే, దీనితో వాళ్ళమీద వైసీపీ నేతలు దృష్టి సాధించటంతో గీతం యూనివర్సిటీ కి చెందిన అక్రమ భూమి వైనం వెలుగులోకి వచ్చింది.

 దాదాపు నలభై ఏళ్ల క్రితం పంచాయితీ అది. రకరకాల మలుపులు తిరిగి, ఇప్పుడు జగన్ చేతిలోకి వచ్చి చేరింది. గీతం కబ్జా చేసిందని చెపుతున్న 40 ఎకరాలను ఒక్కో ఎకరా మార్కెట్ ధర ప్రకారం 8 .5 కోట్లు చెల్లించి తీసుకోమని ప్రభుత్వం తెలిపినట్లు, దానికి గీతం యాజమాన్యం సమాధానం ఇవ్వకపోవటంతో, అక్కడ నిర్మించిన కొన్ని కట్టడాలను విశాఖ అధికారాలు నేలమట్టం చేయటం జరిగిందని తెలుస్తుంది. దీనితో టీడీపీ లో అలజడి రేగింది. అక్కడ అమరావతి లో దెబ్బతిని, ఇక్కడ విశాఖలో ఆర్థికంగా దెబ్బతినే అవకాశం ఉండటంతో ఏమి చేయాలో పాలుపోవటం లేదు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు, రాజకీయ పార్టీ కి ఆర్థిక పరిపుష్టి లేకపోతే నడవటం చాలా కష్టం. అది గమనించే జగన్ టీడీపీ ఆర్థిక శక్తులపై సమరశంఖం పురిస్తున్నాడు.