సోము వీర్రాజు జోకులకి పడీ పడీ నవ్వుతున్న జగన్ ?

somu jagan

రాజకీయంలో వాడే ఒక సామెత ఇప్పుడు ఆంధ్ర బీజేపీ నేతలను చూస్తే గుర్తుకువస్తుంది. వాపు చూసుకొని బలం అనుకుంటే బొక్క బోర్లాపడుతారు అనే సామెతను రాజకీయ నాయకులూ ఎక్కువగా ఉపయోగిస్తారు. వాపుకి బలానికి చాలా తేడా ఉంటుంది. అది గమనించుకొని అడుగులు వేయాలి కానీ, ఎక్కువ ఉహించుకొని ముందుకు వెళ్తే ఇబ్బందులు కలగటమే కాకుండా నలుగురిలో పరువు పోగొట్టుకోవాల్సి వస్తుంది.

cm jagan mla raghunandan rao

 ఎదో దుబ్బాకలో రఘునందన్ లాంటి నేత ఉండటంతో గెలిచారు, అదే గెలుపు అదే ఊపు ఆంధ్రాలో అది కూడా పార్లమెంట్ స్థాయిలో చూపిస్తామని బీజేపీ చెప్పుకోవటం మరి విడ్డురం. తిరుపతిలో జరిగిన పార్టీ కార్యకర్తల విస్తృతస్ధాయి సమావేశంలో కార్యకర్తలను ఎంకరేజ్ చేయాలనో ఏమో కానీ సునీల్ చాలా పెద్ద మాటలే మాట్లాడేశారు. ఏకంగా తిరుపతి ఉపఎన్నికలో గెలిచేస్తామని చెప్పటమే విచిత్రంగా ఉంది. 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి బల్లి దుర్గాప్రసాద్ సుమారు 2.28 లక్షల ఓట్ల మెజారిటితో గెలిచారు. అయన చనిపోవటంతో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.

 ఇక్కడ గమనిస్తే 2019 పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన దుర్గాప్రసాద్ కు సుమారు 7 లక్షలకు పైగా ఓట్లొచ్చాయి. అలాగే ఓడిపోయిన టీడీపీ అభ్యర్ధి పనబాక లక్ష్మికి 4.8 లక్షల ఓట్లు వచ్చాయి. సరే తిరుపతి ఎన్నికల్లో గెలిచేస్తామని పదే పదే భీకర ప్రకటనలు చేస్తున్న బీజేపీ అభ్యర్ధి శ్రీహరిరావుకు వచ్చిన ఓట్లు 16,125. అక్షరాల 16 వేల ఓట్ల చిల్లర మాత్రమే. గెలిచిన వైసీపీ అభ్యర్ధికి వచ్చిన 2.28 లక్షల ఓట్ల మెజారిటి ఎక్కడ బీజేపీ అభ్యర్ధికి వచ్చిన 16 వేల ఓట్లెక్కడ. చివరకు నోటా అంటే నన్ ఆఫ్ ది ఎబోవ్ (నోటా) వచ్చిన ఓట్లు 27 వేలు. అంటే నోటాకు వచ్చిన ఓట్లు కూడా బీజేపీకి రాలేదని అర్ధమైపోతోంది.

somu veerraju

 ఈ స్థితిలో ఉన్న బీజేపీ తిరుపతిలో విజయకేతనం ఎగరవేస్తానని చెప్పటం విశేషం. కొందరు అనుకోవచ్చు దుబ్బాకలో కూడా మొదటి ఎన్నికల్లో 20 వేల చిల్లర మాత్రమే వచ్చాయి కదా, కానీ మొన్నటి ఎన్నికల్లో విజయం సాధించారు కదా .. అలాంటిది ఇక్కడ కూడా విజయం రాకపోదా అని. నిజమే దుబ్బాకలో విజయం లభించవచ్చు కానీ, అక్కడ పరిస్థితులు వేరు ఇక్కడ వేరు. అక్కడ రఘునందన్ ఉన్నాడు, మూడు సార్లు పోటీచేసి ఓడిపోవటంతో సానుభూతి ఉంది. తెరాస నుండి బలమైన అభ్యర్థి నిలబడలేదు. పైగా అభివృద్ధి విషయమ్లో కూడా దుబ్బాక బాగా వెనకపడటం తో తెరాస మీద వ్యతిరేకత వచ్చింది.

 కానీ తిరుపతిలో అసలు బీజేపీ కి సరైన అభ్యర్థి లేడు,అలాగని అభివృద్ధిలో తిరుపతికి వచ్చిన లోటేమి లేదు. ప్రజా సంక్షేమ పాలన అందిస్తూ జగన్ ముందుకి వెళ్తున్నాడు, కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకత కూడా లేదు. ఇలాంటి పరిస్థితిలో బీజేపీ ఏ ధైర్యంతో తిరుపతిలో గెలుస్తామని చెపుతుంది. పైగా జనసేన మద్దతుతో విజయమని చెపుతుంది, అసలు రాష్ట్రంలో జనసేన కు మద్దతు ఇచ్చేవాళ్ళు ఎంతమంది, అందులో తిరుపతిలో జనసేనకు ఉన్న పట్టు ఏమిటి..? వాళ్ళ ఓటు బ్యాంకు ఎంత..? అనేది లెక్కలోకి తీసుకోని చూస్తే పాపం బీజేపీ జనసేన మీద చాలా హోప్స్ పెట్టుకున్నట్లు ఉందే అనిపిస్తుంది. ఇలా ఏ కోణంలో చూసిన బీజేపీ కి గెలుపు అవకాశాలు కనిపించటం లేదు, కానీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు మాత్రం పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటే వైసీపీ నేతలు లోలోపలే నవ్వుకుంటున్న పరిస్థితి.