అసెంబ్లీ సమావేశాల కోసం విపరీతంగా ఎదురు చూస్తున్న జగన్ – పెద్ద కారణం ఉంది !

cm jagan ap

 ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ సమావేశాలు అంటే ఎక్కడ ఉత్సహం వస్తుంది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను పెద్దగా ఎవరు పట్టించుకోకపోయినా కానీ, ఆంధ్ర అసెంబ్లీ అంటే తెలుగు రెండు రాష్ట్రాల ప్రజలు అలర్ట్ అవుతాయి. మీడియా లో కూడా విపరీతమైన ప్రాధాన్యత ఇస్తారు, ఎందుకంటే అసెంబ్లీ వేదికగా అధికార , ప్రతిపక్షాల మధ్య రసవత్తమైన సంభాషణలు జరుగుతాయి, సవాళ్లు, ప్రతి సవాళ్లు లతో అసెంబ్లీ దద్దరిలిపోతుంది.

cm jagan ap

 ఈ సారి డిసెంబర్ లో జరగబోయే అసెంబ్లీ సమావేశాల కోసం సీఎం జగన్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలుస్తుంది. ఈ శీతాకాల సమావేశాలు ఫుల్ హాట్ హాట్ గా జరుగుతాయని అంటున్నారు. ఈసారి సమావేశాల్లో అనేకమైన కీలక బిల్లులు ప్రవేశపెడతారు. అదే సమయంలో దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించిన విషయాన్నీ కూడా జగన్ ఈ సమావేశాల్లో ప్రస్తావించే అవకాశం ఉందని తెలుస్తుంది. దాదాపు నెలన్నర క్రితం న్యాయ మూర్తుల మీద ఏపీ సీఎం జగన్ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డేకు లేఖ రాసిన సంగతి విధితమే.

 ఆ లేఖలో ఆయన అనేక ఆరోపణలు కూడా చేశారు. మరి దాని మీద ఎంతవరకూ దర్యాప్తు జరుగుతోంది అన్నది తెలియదు. అది రహస్యం కూడా. ఇదిలా ఉంటే జగన్ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ ఆయన మీద పిటిషన్లు సుప్రీం కోర్టులో పడ్డాయి. దాని మీద విచారణ కూడా తొందరలో జరిగే అవకాశం ఉంది. ఈ నేపధ్యంలో తాను కొందరు న్యాయ మూర్తుల పనితీరు మీద రాసిన లేఖ మీద అన్ని విషయాలను అసెంబ్లీలో చర్చకు పెట్టాలని జగన్ భావిస్తున్నాట్లుగా చెబుతున్నారు.

cm jagan

 న్యాయ మూర్తులు, కోర్టుల మీద శాసన సభలలో ఇప్పటిదాకా ఎవరూ ఇలాంటి చర్చ జరపలేదు. రాజ్యాంగం ప్రకారం చూసుకుంటే శాసన సభలకు స్వయం ప్రతిపత్తి ఉంటుంది. అక్కడ జరిగే చర్చలు స్పీకర్ ఆదేశంతో జరుగుతాయి. వాటి మీద అడ్డుకునేందుకు కూడా ఎవరికీ హక్కులు లేవు. సీఎం జగన్ అనుకున్నట్లు న్యాయ వ్యవస్థపై అసెంబ్లీలో చర్చ జరిపితే మాత్రం దేశ చరిత్రలోనే ఇదో కీలక ఘట్టం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

 న్యాయ వ్యవస్థలో పారదర్శకతను తాను ఎలా కోరుకుంటున్నది జగన్ వివరిస్తారని అంటున్నారు. తద్వారా జగన్ దేశంలో న్యాయ సంస్కరణ కోసం తన పోరాటాన్ని ఆపేది లేదని కూడా స్పష్టం చేయదలచుకున్నారని అంటున్నారు. ఇక ఇలా చర్చించడం ద్వారా ప్రజలకు కూడా వాస్తవాలు తెలుస్తాయని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటివరకు ఆంధ్ర అసెంబ్లీ సమావేశాలు అంటే కేవలం తెలుగు రాష్ట్రాల ప్రజలు మాత్రమే ఆసక్తి కనబరిచేవాళ్ళు, అసెంబ్లీ లో న్యాయ వ్యవస్థ గురించి చర్చ జరిగితే మాత్రం దేశ మొత్తం ఆంధ్ర అసెంబ్లీ వైపు చూసే అవకాశం లేకపోలేదు.