ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిన్న ప్రారంభం అయిన విషయం తెలిసిందే. అయితే… మొదటి రోజు టీడీపీ సభ్యులను సభనుంచి సస్పెండ్ చేశారు. సభ కార్యకలాపాలకు అడ్డు తలుగుతున్నారని… చంద్రబాబుతో సహా.. టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలందరినీ స్పీకర్ తమ్మినేని సస్పెండ్ చేశారు. అయితే.. అది నిన్నటి వరకు మాత్రమే.
ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈసందర్భంగా రెండో రోజు కూడా టీడీపీ సభ్యులు సభ కార్యకలాపాలకు అడ్డు తగిలారు. దీంతో సీఎం జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష చంద్రబాబుతో సహా… టీడీపీ సభ్యులంతా సభకు తీవ్ర అంతరాయం కలిగిస్తున్నారని సీఎం జగన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
సీఎం ప్రసంగాన్ని కూడా వినకుండా.. ఏమాత్రం అవగాహన లేకుండా సభకు వచ్చి.. సీఎం ప్రసంగాన్ని అడ్డుకోవడం దేనికి నిదర్శనం. ఇలా చర్చ జరగకుండా చంద్రబాబు గందరగోళం సృష్టిస్తున్నారు. ఇలా అయితే వచ్చే ఎన్నికల్లో టీడీపీకి రెండుమూడు సీట్లు కూడా రావు.. అంటూ జగన్ సంచలన కామెంట్స్ చేశారు.
సీఎం జగన్ తో పాటు స్పీకర్ తమ్మినేని కూడా టీడీపీ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యులు ఇలా సభకు ఆటంకం కలిగిస్తే ఎలా అంటూ ప్రశ్నించినా.. టీడీపీ సభ్యులు వినకపోవడంతో… టీడీపీ సభ్యుడు నిమ్మల రామనాయుడిని సభ నుంచి ఒకరోజు సస్పెండ్ చేశారు.