AP: వైయస్ జగన్ కడపకు చేసిందేమీ లేదు…. టీడీపీ హయామంలోనే అభివృద్ధి: చంద్రబాబు

AP: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జగన్ ఇలకాలో పర్యటించారు. కడప జిల్లా మైదుకూరులో నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. కడప జిల్లాకు గత ప్రభుత్వాలు చేసిన మంచి ఏమాత్రం లేదని తెలిపారు. కడపలో ఏదైనా అభివృద్ధి జరిగింది అంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగిందని తెలిపారు.

తెలుగు జాతి కోసం పరితపించిన నాయకుడు ఎన్టీఆర్ అని అన్నారు. ఆయన పేరు కోట్లాది నిరుపేదల గుండెల్లో తీపి జ్ఞాపకమని తెలిపారు పార్టీ పెట్టిన తొమ్మిది నెలలలోనే అధికారంలోకి వచ్చిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అంటూ ఎన్టీఆర్ గురించి ఎంతో గొప్పగా తెలిపారు. పేదరికం లేని సమాజం ఏర్పడాలి అంటే అది కేవలం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని అది కూడా త్వరలోనే చూపిస్తామని చంద్రబాబు నాయుడు తెలిపారు.

రతనాలసీమ అయిన ఈ రాయలసీమకు కాంగ్రెస్ పార్టీతో సహా మిగిలిన ఏ పార్టీ కూడా చేసింది ఏమీ లేదని తెలిపారు. మా పార్టీ తప్ప మరే పార్టీ హయాంలోనూ కడపలో అభివృద్ధి జరగలేదని అన్నారు. నదులు అనుసంధానం పూర్తి అయితే.. అభివృద్ధిలో రాయలసీమ పరుగులు పెట్టడం ఖాయమని తెలిపారు. వైసీపీ సర్కార్ పోలవరం ప్రాజెక్టును గోదావరి నదిలో ముంచేస్తుందని తెలిపారు. తిరిగి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలు చేపట్టామని ప్రస్తుతం డయాగ్రమ్ వాల్ నిర్మాణం జరుగుతుందని సీఎం వెల్లడించారు.

కొప్పర్తి ఇండస్ట్రియల్ కారిడార్, కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం పూర్తి చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. రాయలసీమ రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందని,పోలవరం-బనకచర్ల ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నామని తెలిపారు. ఆ ప్రాజెక్ట్ పూర్తి అయితే రాష్ట్రం మొత్తం సస్యశ్యామలం అవుతుందని చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా తెలిపారు. మరొక నెలలో వాట్సప్ గవర్నెన్స్ తీసుకొస్తున్నామని.. ప్రజలు ఇక ఆఫీసులకు వెళ్లే పని లేదని.. ఆఫీసులే ప్రజల ఇంటి వద్దకు వస్తాయి అంటూ చంద్రబాబు నాయుడు తెలిపారు.