YSR District: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకుంటున్నటువంటి కొన్ని నిర్ణయాలు సంచలనంగా మారాయి. అయితే తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైయస్సార్ జిల్లాకు ఊహించని షాక్ ఇచ్చారని చెప్పాలి. వైయస్సార్ జిల్లాగా వెలుగొందుతున్న వైయస్సార్ జిల్లా పేరును మార్చేస్తూ చంద్రబాబు నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశాలలో భాగంగా ఈయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
నిజానికి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ జిల్లాకు వైఎస్ఆర్ జిల్లా అని పేరు మార్చారు. అంతకుముందు ఈ జిల్లాకు వైయస్ ఆర్ కడప జిల్లా అని పేరు ఉండేది. ఇక జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత తన తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి పేరును ఈ జిల్లాకు పెడుతూ వైఎస్ఆర్ జిల్లాగా పేరు మార్చేశారు.
నిజానికి వైయస్సార్ కడప జిల్లా అని జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు అదే పేరుతో ఉండేది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు తిరిగి ఈ జిల్లాకు వైయస్సార్ కడప జిల్లాగా పేరు మార్చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు కానీ ఎప్పుడు కూడా ఈ జిల్లాకు పేరు మార్చలేదు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కడప జిల్లా గానే పేరు పొందింది.
ఇక ఎప్పుడైతే రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారో అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర్ రెడ్డి గుర్తుగా ఆ జిల్లాకు వైయస్సార్ కడప జిల్లాగా పేరు మార్చింది. అయితే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కడప తీసేసి వైఎస్ఆర్ జిల్లాగా పేరు పెట్టారు. ఇప్పుడు తాజాగా చంద్రబాబు నాయుడు కూడా వైయస్సార్ జిల్లాకు కడప జోడిస్తూ వైయస్సార్ కడప జిల్లాగా పేరు మార్చేశారు.