Kadapa: కడప టీడీపీ అడ్డా.. చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు!

Kadapa: కడప అంటేనే వైయస్సార్ కుటుంబానికి అడ్డా అని చెప్పాలి. గత మూడు దశాబ్దాలుగా కడప రాజకీయాలను వైయస్ కుటుంబం ఏలుతోంది. ఇలా ఇప్పటివరకు అక్కడ ఇతర పార్టీలు మెజారిటీని సాధించిన దాఖలాలు లేవు కానీ 2024 ఎన్నికలలో కడపలో పసుపు జెండా ఎగిరింది. మొత్తం పది నియోజకవర్గాలకు గాను దాదాపు ఏడు నియోజకవర్గాలలో కూటమి విజయం సాధించింది. ఇలా కడపలో కూడా టిడిపికి మంచి మెజారిటీ లభించడంతో ఈసారి మహానాడు కార్యక్రమాన్ని కడపలో ఎంతో ఘనంగా నిర్వహించారు.

ఈ మహానాడు కార్యక్రమం మూడు రోజులపాటు ఎంతో విజయవంతంగా జరిగింది. ఇలా కడపలో మహానాడు కార్యక్రమం దిగ్విజయం కావడంతో చంద్రబాబు నాయుడు సంతోషం వ్యక్తం చేశారు.కడప తమ అడ్డా అని చెప్పేందుకు సభ నిర్వహించినట్లు చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రమంతా రాయలసీమ గర్జన వినిపించాలని తెలిపారు.మంచి చేసిన టీడీపీకి అండగా ఉంటామని ప్రజలు నిరూపించారన్నారు. కడప దిగ్బంధమైందని, అన్ని దారులు ఇటే ఉన్నాయని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన టీడీపీ మహానాడు సూపర్ సక్సెస్ అయిందని ఆనందం వ్యక్తం చేశారు.

ఈసారి కడపలో టిడిపి మహానాడు జాతర జరిగింది అంటూ చంద్రబాబు నాయుడు సంతోషం వ్యక్తం చేశారు. గతంలో కడప వైయస్ అడ్డా అంటూ మాట్లాడారు కడపలో మహానాడు నిర్వహించలేరని చాలెంజ్ చేశారు కానీ ప్రస్తుతం కడప రాజకీయాలలో కూడా మార్పులు మొదలయ్యాయని ఈ ఎన్నికల ఫలితాలు నిరూపించాయని చంద్రబాబు తెలిపారు. రాయలసీమ మొత్తంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 7 సీట్లు వస్తే.. ఒక్క కడప జిల్లాలోనే తెలుగుదేశం పార్టీ 7 సీట్లు వచ్చాయని చంద్రబాబు గుర్తు చేశారు. ఇక 2029 ఎన్నికలలో కడప మొత్తం తెలుగుదేశం పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందని చంద్రబాబు నాయుడు చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.