AP: ఇటీవల గ్రేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తి కావడంతో ఈ ఎన్నికలలో కూటమి గెలవడంతో చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. 2024 ఎన్నికలలో కూటమి భారీ మెజారిటీతో గెలిచిన సంగతి మనకు తెలిసిందే .ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ 2024 ఎన్నికలు ఒక చారిత్రాత్మక విజయం అయితే తిరిగి 9 నెలలలో ఎమ్మెల్సీ ఎన్నికల విజయం మరో చరిత్ర అంటూ చంద్రబాబు తెలిపారు.
ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ లో కూడా రెండు టీచర్ సంఘాలకు ఓట్ వేయమని చెప్పాము పని చేసే వారికే గెలుపు వరిస్తుంది. జనసేన తరపున పవన్ కళ్యాణ్ కు అభినందనలు. బీజేపీ, జనసేన కార్యకర్తలు క్రమశిక్షణతో పని చేసారు. ఇక కేంద్రం నుంచి ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలను అందిస్తోందని చంద్రబాబు తెలిపారు.
అమరావతి స్మశానం అన్నారు. రాజధాని పేరుతో ముడుముక్కలాట ఆడారు. కానీ విశాఖ రైల్వే జోన్ కు ప్రధాని ఫౌండేషన్ వేసారు. ప్రధాని గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ కు శంఖుస్థాపన చేశారు. 67 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్లో మళ్లీ మళ్లీ మనమే అధికారంలోకి రావాలి అంటే ఎన్డీఏ కలిసిమెలిసి ఉండాలని ఎన్డీఏ కలిసి ఉంటే ఏ పార్టీ కూడా తిరిగి ఆంధ్రాలో అధికారంలోకి రాలేదు అంటూ చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
