Y.S. Jagan: ప్రస్తుతం ఏపీలో వైయస్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ గురించి సంచలనమైన వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. వైయస్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కావడం ఖాయమేనా? జగన్ అరెస్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? జగన్ అరెస్ట్ విషయమై చంద్రబాబు ఢిల్లీ వెళ్లారా? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. ఇటీవల చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లిన విషయం మనకు తెలిసిందే.
ఇలా ఢిల్లీ వెళ్లిన చంద్రబాబుకు పలువురు కేంద్ర మంత్రులు స్వాగతం పలికారు. ఢిల్లీ చేరుకోగానే చంద్రబాబు నాయుడు కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షాను కలిసారు. అక్కడే డిన్నర్ చేసి దాదాపు రెండు గంటల పాటు అమిత్ షాతో సుదీర్ఘమైన చర్చలు జరిపారని, అలాగే జగన్ అక్రమాల గురించి అతని అరెస్టు గురించి కూడా చర్చించినట్టు తెలుస్తుంది.
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పెద్ద ఎత్తున మద్యం కుంభకోణం జరిగిందని, భారీ స్థాయిలో స్కాం జరగటం పక్క ఆధారాలతో బయటపడటంతో జగన్ అరెస్టుకు పావులు కదుపుతున్నారని తెలుస్తోంది. అయితే జగన్ అరెస్ట్ అనేది కేవలం రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే కాదు కేంద్ర ప్రభుత్వ అనుమతి కూడా తీసుకోవాలని కేంద్ర పెద్దల సూచనల మేరకే జగన్ మోహన్ రెడ్డిని అరెస్టు చేయాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తుంది.
ఇలా చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలను కలవడం వెనుక ముఖ్య ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అని తెలుస్తోంది. ఇప్పటికే మద్యం కుంభకోణంలో పలువురిని అరెస్టు చేసి సీట్ విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పలు కీలక ఆధారాలు బయటపడటంతో జగన్ అరెస్ట్ కు కూడా రంగం సిద్ధమవుతోంది. ఇకపోతే ఇటీవల జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ కార్యక్రమంలో కూడా మద్యం కుంభకోణం గురించి మాట్లాడారు.
తమ ప్రభుత్వ హయామంలో మద్యం కుంభకోణం జరగలేదని ఎక్కడ అవినీతి లేదని తెలిపారు. మా ప్రభుత్వంలో మద్యం దుకాణాలను నడిపింది ప్రభుత్వమే అయితే ఇక అవినీతి ఎక్కడ జరుగుతుందని జగన్ ప్రశ్నించారు. అలాగే నేను విజయవాడలోనే ఉంటానని ఎవరొచ్చి అరెస్టు చేస్తారో చేసుకోండి అంటూ కూడా ఇటీవల జగన్ సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. అయితే కేంద్ర పెద్దలు మాత్రం జగన్ అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నారని ఏ క్షణమైనా జగన్ జైలుకు వెళ్లాల్సి వస్తుందని తెలుస్తోంది.