radhe shyam : ఈ ఏడాది ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఎన్నో అంచనాలు నమోదు చేసుకొని రిలీజ్ కి వచ్చిన చిత్రాల్లో పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం “రాధే శ్యామ్”. అయితే రిలీజ్ కి ముందు మాట్లాడుకుంటే ఇండియన్ సినిమా దగ్గర ఇది ఒక హై బడ్జెట్ పాన్ ఇండియా సినిమా అని అందరికీ తెలుసు.
పైగా మంచి అంచనాలు కూడా ఉన్నాయి. అయితే ఇవి పక్కన పెడితే ఎంత పాన్ ఇండియా సినిమా అయినా కూడా ప్రభాస్ మార్కెట్ హిందీ మరియు తెలుగు భాషల్లో ఉంది. అందులో భాగంగా మన తెలుగులో మంచి వసూళ్లు కూడా తన సినిమాలకి వస్తాయి. అయితే ఈ సినిమా కి టికెట్ ధరల విషయంలో చాలా సి;క్లియర్ కట్ గా అన్యాయం చేసారని చెప్పాలి.
ఈ చిత్రం దాదాపు 300 కోట్లు బడ్జెట్ తో తెరకెక్కింది. సరే ప్రభాస్ రెమ్యునరేషన్ తీసేసినా ఎలా లేదన్నా 150 కోట్లు పైగా బడ్జెట్ అవుతుంది. అయినా కూడా ఏపీలో అప్పటికే కొత్త జీవో వచ్చినా ఎలాంటి టికెట్ ధరల హైక్స్ ఇవ్వలేదు. సరే అది పక్కన పెట్టినా ఇప్పుడు లేటెస్ట్ గా రిలీజ్ కి వస్తున్న “సర్కారు వారి పాట” కి అనూహ్యంగా 45 రూపాయలు పెంచారు.
అసలు దీనికి ఏ లెక్కన పెంచారో కూడా అర్ధం కాలేదు. షూటింగ్ ఏపీలో 20 శాతం జరిగిందో లేదో కానీ బడ్జెట్ పరంగా చూసుకున్నా 100 కోట్లు అందరి రెమ్యునరేషన్ లు తీసి చూసినా అయ్యి ఉండదు అయినా సినిమాకి రేట్లు పెంచారు అంటే ఇక్కడ ప్రభాస్ సినిమాకి అన్యాయం జరిగినట్టే కదా??
అప్పటికే చాలా రోజులు ధరల పెంపు టికెట్స్ ఓపెనింగ్ పై చాలా ఆసక్తిగా ఆడియెన్స్ ఎదురు చూసినా లాస్ట్ కి అన్యాయమే జరిగింది. పైగా దాని తర్వాత వచ్చిన RRR కూడా ధరలు పెంచారు. ప్రభాస్ సినిమాకి మాత్రం ఇలా జరగడం నిజంగా గమనార్హం, బాధాకరం. తాను ఇప్పటికే ఎన్నోసార్లు ఏపీ ప్రభుత్వానికి ఎన్నో కోట్లు కూడా దానం చేసాడు.