భూమా అఖిల ప్రియ అత్యంత చిన్న వయస్సులోనే మంత్రి పదవి చెప్పటింది. అధికారంలో ఉన్నన్నాళ్ళు డోంట్ కేర్ అన్నట్టు రాజకీయాలు చేసింది. అయితే టైం బాగాలేనప్పుడు కొంచెం తగ్గి ఉండాలనే చిన్న సూత్రం పాటించక కష్టాల్లో ఇర్రుకుంటుంది. మొన్నామధ్య వాళ్ళ నాన్న భూమా నాగి రెడ్డి కి అత్యంత సన్నిహితుడైన ఏవి సుబ్బా రెడ్డి ని చంపడానికి సుపారీ ఇచ్చిన వ్యవహారంలో తన పేరు, తన ఇష్టపడి పెళ్లిచేసుకున్న తన భర్త భార్గవ రాముడు పేర్లు ప్రధానంగా వినిపించాయి.
ఆ కేసు ఆలా ఉండగానే ఇప్పుడు మరో వ్యవహారం . తాజాగా మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ క్వారంటైన్ సెంటర్‌కు వెళ్లి కరోనా వ్యాప్తి చేశారని అఖిలప్రియ ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలపై హఫీజ్ ఖాన్ సీరియస్ అయ్యారు.ఆయన సీఐడీకి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అఖిలప్రియను సీఐడీ అధికారులు గురువారం విచారించనున్నారు.
ఇంకా చిన్న వయస్సు, ఎంతో రాజకీయ భవిష్యత్తు వున్న భూమా అఖిల ప్రియ ఛేజుతులారా ఆ రాజకీయ భవిష్యత్తును పాడు చేసుంటున్నారు అని ఆమె సన్నిహితులు బాధపడుతున్నారు. అయితే విశ్లేషకులు మాత్రం “రాజకీయాల్లో ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా భూమా అఖిల ప్రియ నేర్చుకోవాలని” సినిమా డైలాగులు వాడి హితవు పలుకుతున్నారు.