Allu Arjun: అల్లు అర్జున్ మాకు నరకం చూపించారు… వదిలిపెట్టలేదు కొరియోగ్రాఫర్ సంచలన వ్యాఖ్యలు!

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల పుష్ప 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. అయితే ఈ సినిమా విడుదల సమయంలో అభిమాని మరణించడంతో ఎన్నో వివాదాలను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇలా అల్లు అర్జున్ ఈ ఘటనలో అరెస్ట్ అయి జైలుకు కూడా వెళ్లి వచ్చారు..

ఇలా ఆయన నటించిన ఒక సినిమా ఈ స్థాయిలో సక్సెస్ అయినప్పటికీ ఈ సక్సెస్ అల్లు అర్జున్ సెలెబ్రేట్ చేసుకోలేని పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పాలి. ఇటీవల కాలంలో అల్లు అర్జున్ తరచూ ఏదో ఒక వివాదంలో నిలుస్తూనే ఉన్నారు. అయితే తాజాగా బన్నీ గురించి ఒక కొరియోగ్రాఫర్ మాట్లాడుతూ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ మాకు చాలా నరకం చూపించారు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

కొనిగ్రాఫర్ గా ఇండస్ట్రీలో మధ్య సక్సెస్ అందుకున్న వారిలో గణేష్ మాస్టర్ ఒకరు. అయితే తాజాగా ఈయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా పుష్ప 2 గురించి అల్లు అర్జున్ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సినిమాలో గంగో రేణుక తల్లి,సూసకి అగ్గి రవ్వమాదిరి వంటి పాటలకి కొరియోగ్రాఫర్ గణేష్ మాస్టర్ ఎంత మంచి డెడికేషన్ పెట్టి ఎంత మంచి స్టెప్పులు అందించారో చెప్పనక్కర్లేదు.

ఈ రెండు పాటలు సినిమాకే హైలెట్గా నిలబడమే కాకుండా ఇప్పటికీ సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ట్రెండ్ అవుతున్నాయి. అయితే ఈ పాటల షూటింగ్ సమయంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి గణేష్ మాస్టర్ ఈ సందర్భంగా బయటపెట్టారు .నిజానికి గంగో రేణుక పాట సుమారు 29 రోజులపాటు షూటింగ్ జరిగిందని తెలిపారు. ఈ పాట షూటింగ్ సమయంలో ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా బన్నీ చాలా జాగ్రత్తగా పరిశీలిస్తూ షూటింగ్లో పాల్గొన్నారు.

ఇక ఈ పాట షూటింగ్ సమయంలో బన్నీ కాలికి గాయమైంది అయినప్పటికీ కూడా ఈయన వెనకడుగు వేయకుండా కాలికి కట్టు కట్టుకొని మరి షూటింగ్లో పాల్గొన్నారు. ఇలా ఆయన కష్టపడటమే కాకుండా మమ్మల్ని కూడా అలాగే తొందర పెడుతూ మాకి నరకం చూపించారని గణేష్ మాస్టర్ తెలిపారు.ఆయన కాలికి దెబ్బ తగిలిన మమ్మల్ని వదిలిపెట్టలేదు. ఈ పాట చిత్రీకరణ ఎలాగైనా పూర్తి చేయాల్సిందే అని పట్టుబట్టి మరీ మాకు కూడా నరకం చూపించాడు. ఇక అల్లు అర్జున్ డెడికేషన్ కి హ్యాట్సాఫ్ అనాల్సిందే అంటూ గణేష్ మాస్టర్ ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.