విక్రమ్ 20 అవతార్స్..”కోబ్రా” ని భారీ రిలీజ్ చేస్తున్న ఈ “విక్రమ్” నిర్మాత.!

ఇండియన్ సినిమా సినిమాలో క్యారెక్టర్ కోసం ఎంత దూరం అయినా సరే వెళ్లగలిగే అతి తక్కువ మంది స్టార్ నటులు హీరోలలో చియాన్ విక్రమ్ కూడా ఒకడు. అయితే విక్రమ్ ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో ఎన్నెన్నో డిఫరెంట్ గెటప్స్ చేసి ఆడియెన్స్ ని మెస్మరైజ్ చేసాడు. తన లాస్ట్ టైం “ఇంకొక్కడు”, “ఐ” చిత్రాల్లో ప్రొస్థెటిక్ మేకప్ లతో నాలుగైదు లుక్స్ ని చూపించిన విక్రమ్ ఇప్పుడు ఏకంగా 20 అవతార్స్ నటిస్తూ చేస్తున్న చిత్రమే “కోబ్రా”. 

తమిళ దర్శకుడు అజయ్ జ్ఞ్యాన ముత్తు తెరకెక్కించిన ఈ చిత్రంలో విక్రమ్ ఏకంగా 20 గెటప్పులు వేసి అదరగొట్టాడు. అయితే కొన్ని లుక్స్ ని కూడా రివీల్ చేసిన మేకర్స్ టోటల్ అయితే విక్రమ్ 20 లుక్స్ లో కనిపించనున్నాడని ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు. మరి అత్యంత గ్రాండ్ గా చేసిన ఈ చిత్రాన్ని భారీ హంగులు అలాగే సాలిడ్ కాన్సెప్ట్ తో తెరకెక్కిస్తుండగా.. 

ఈ చిత్రాన్ని తమిళ్ లో ప్రముఖ డిస్ట్రిబూటింగ్ సంస్థ అయినటువంటి రెడ్ జయింట్స్ వారు రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. అక్కడి సీఎం తనయుడు ఉదయనిధి స్టాలిన్ రీసెంట్ గా భారీ చిత్రం “విక్రమ్” ని రిలీజ్ చేసి భారీ స్థాయి వసూళ్ళని అందుకున్నారు. 

ఇపుడు అదే విధంగా ఈ విక్రమ్ సినిమాని నిర్మాణ సంస్థ 7 స్క్రీన్ స్టూడియోస్ వారితో రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. ఇక ఈ చిత్రంలో ప్రముఖ ఇండియన్ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ విలన్ గా నటించగా కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. అలాగే ఏ ఆర్ రెహమాన్ సంగీతం అయితే అందించాడు.