చిరంజీవి అల్లుడు కూడ హాస్పిటల్లో

Chiru's son in law Klayna Dhevv tested positive for Covid 19

Chiru's son in law Klayna Dhevv tested positive for Covid 19

ఇండస్ట్రీలో కరోనా కలకలం ఆగట్లేదు. వరుస పెట్టి స్టార్లు కరోనా బారినపడుతున్నారు. ఇప్పటికే పలువురు హీరో హీరోయిన్లు, దర్శకులు వైరస్ బారిన పడగా తాజాగా మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ సైతం కరోనాకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన ‘కిన్నెరసాని’ సినిమా షూటింగ్లో ఉన్నారు. కొన్నిరోజులుగా కరోనా లక్షణాలు బయటపడటంతో ఆయన పరీక్షలకు వెళ్లారట. నిన్న వచ్చిన రిపోర్ట్స్ లో పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన ఆసుపత్రిలో క్వారంటైన్ తీసుకుంటున్నారు. ఈ సంగతిని కళ్యాణ్ దేవ్ స్వయంగా తెలిపారు.

ఇక మెగా ఫ్యామిలీలో ఇప్పటికే పవన్ కళ్యాణ్ కరోనాకు గురై చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే ఆయన కోలుకుంటున్నారు. ఇటీవల ‘ఆచార్య’ షూటింగ్లో పాల్గొన్న సోనూ సూద్ సైతం కరోనాకు గురికావడంతో రామ్ చరణ్ సైతం క్వారంటైన్లోకి వెళ్లిపోయారు. చరణ్ కారవాన్ డ్రైవర్ సైతం కరోనాకు గురై మృతిచెందడం జరిగింది. దీంతో చరణ్ క్వారంటైన్ తీసుకున్నారు. మొత్తానికి ఇండస్ట్రీలో కరోనా కలకలం తీవ్రంగానే నడుస్తోంది.