పవన్ సినిమా డేట్ కి ఎసరు పెట్టిన మెగాస్టార్.!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పుడు “భీమ్లా నాయక్” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే దీనితో పాటుగా పవన్ మరిన్ని సినిమాలు కూడా లైన్ లో పెట్టారు. అయితే దీనికంటే ముందు ఎప్పుడో వకీల్ సాబ్ చేస్తున్న సమయంలోనే దర్శకుడు క్రిష్ తో “హరిహర వీరమల్లు” అనే భారీ సినిమా కూడా స్టార్ట్ చేశారు. దాదాపు 50 శాతానికి పైగా కూడా పూర్తయ్యింది.

అలాగే వచ్చే ఏడాది ఏప్రిల్ 29న ఈ సినిమా డేట్ కూడా ఫిక్స్ అయ్యింది. కానీ సరిగ్గా ఇదే రోజున పవన్ అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన “గాడ్ ఫాథర్” ని అదే డేట్ కి దింపాలని చూస్తున్నారట. దీనితో పవన్ సినిమాకే అన్నయ్య ఎసరు పెట్టినట్టు అయ్యింది. అయితే వీరమల్లు సినిమా ఇంకా కంప్లీట్ అవ్వాల్సి ఉంది మరి అదెప్పుడు అయ్యి రిలీజ్ అవుతుందో చూడాలి.