Megastar Chiranjeevi: గురువారం ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో సినీ పెద్దలు భేటీ కానున్నారు. ఈ క్రమంలోనే సినీ ప్రముఖులు జగన్మోహన్ రెడ్డిని కలిసి తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న సమస్యల గురించి చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రితో భేటీ కావడం కోసం మెగాస్టార్ చిరంజీవి తో పాటు రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అరవింద్,
డివివి దానయ్యలతో పాటు మహేష్ బాబు, ఎన్టీఆర్ కూడా జగన్మోహన్ రెడ్డిని కలువబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఈ మీటింగ్ లోఏ విధమైనటువంటి చర్చలు గురించి ప్రస్తావిస్తారనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో ఇప్పటికే సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని భేటీ అయినట్లు తెలుస్తోంది. సమావేశంలో టాలీవుడ్ డిమాండ్లతో పాటు ఏసీ థియేటర్లకు, నాన్ ఏసీ థియేటర్లకు పన్నులు, రాయితీలు సినిమా టికెట్ల రేట్లు గురించి ప్రస్తావించినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే గురువారం సినీ పెద్దలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలువనున్న నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి నందమూరి బాలకృష్ణకు ఫోన్ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో మీటింగ్ జరుగనున్న నేపథ్యంలో బాలకృష్ణను కూడా ఈ సమావేశానికి హాజరుకమ్మని మెగాస్టార్ చిరంజీవి బాలకృష్ణను ఆహ్వానించారు.అయితే బాలకృష్ణ మెగాస్టార్ చిరంజీవి ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించి రాలేనని చెప్పడమే కాకుండా శుభవార్తతో తిరిగి రావాలని తెలియజేశారు. ఇటీవల బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గంను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని నిరసన కార్యక్రమంలో పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే బాలకృష్ణ ముందస్తు జాగ్రత్త కోసం సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నందున రాలేనని బాలకృష్ణ తెలియజేసినట్లు తెలుస్తుంది.
