కేసీఆర్ దెబ్బకు చిరంజీవి, నాగార్జున భయపడ్డారా.. ఇండస్ట్రీ దూరమవుతోందా?

ఈ నెల తొలి వారంలో జరిగిన బ్రహ్మాస్త్ర ఈవెంట్ కు తెలంగాణ సర్కార్ అడ్డంకులు సృష్టించిన సంగతి తెలిసిందే. అనుమతులు ఇచ్చినట్టే ఇచ్చి చివరి నిమిషంలో వేర్వేరు కారణాలు చెప్పి అనుమతులు రద్దు చేయడం జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెగ ఫీలయ్యారు. అయితే కేసీఆర్ సర్కార్ ఈ విధంగా వ్యవహరించడంతో టాలీవుడ్ స్టార్ హీరోలు ప్రస్తుతం ఇతర రాష్ట్రాలలో ఈవెంట్లు జరపడంపై దృష్టి పెట్టారు.

గాడ్ ఫాదర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 25వ తేదీన అనంతపురంలో జరగనుంది. నాగార్జున ది ఘోస్ట్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కర్నూలులో జరగనుంది. సాధారణంగా సినిమాలకు సంబంధించిన ఈవెంట్లు హైదరాబాద్ లో జరుగుతాయనే సంగతి తెలిసిందే. అయితే టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు తమ సినిమాల ఈవెంట్ల కోసం హైదరాబాద్ కు వదిలి ఏపీపై దృష్టి పెట్టడం గమనార్హం. కేసీఆర్ దెబ్బకు చిరంజీవి, నాగ్ భయపడ్డారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఈవెంట్ల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసి చివరి నిమిషంలో ఈవెంట్ క్యాన్సిల్ అంటే ఇబ్బంది పడాల్సి ఉంటుందని మరి కొందరు భావిస్తున్నారని తెలుస్తోంది. బ్రహ్మాస్త్ర విషయంలో కేసీఆర్ సర్కార్ వ్యవహరించిన తీరు వల్ల ఇండస్ట్రీ దూరమవుతోందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. భవిష్యత్తులో సినీ ఇండస్ట్రీ ఆంధ్రకు దగ్గరైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదని చెప్పవచ్చు.

జూనియర్ ఎన్టీఆర్ ను అనవసరంగా టార్గెట్ చేసి కేసీఆర్ సర్కార్ ప్రజల్లో, ప్రేక్షకుల్లో, ఇండస్ట్రీ వర్గాల్లో ఈ తరహా భావనను కలిగిస్తోంది. రాబోయే రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్ విషయంలో కేసీఆర్ సర్కార్ ఏ విధంగా వ్యవహరిస్తుందో చూడాల్సి ఉంది. కేసీఆర్ సర్కార్ చేస్తున్న చిన్నచిన్న తప్పులకు ఆ పార్టీ భారీ స్థాయిలో మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పవచ్చు.