భారతీయ జనతా పార్టీ దక్షిణాదిన బలపడటానికి రాజకీయంగా అన్ని వ్యూహాలు పన్నింది. వాటిలో మెజారిటీ వ్యూహాలు విఫలమయ్యాయి. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో ఉండే బలమైన స్థానిక పార్టీలతో పొత్తు పెట్టుకోవాలని ప్రయత్నాలు చేశారు. కానీ అవేవీ జరగలేదు. తమిళనాట అన్నాడీఎంకే, డీఎంకే రెండూ కూడ బీజేపీతో కలిసి ఎన్నికల్లోకి దిగడానికి సుముఖంగా లేవు. అయితే కమలనాథులు ఎన్నాళ్లగానో రజినీకాంత్ మీద ఆశలు పెట్టుకుని ఉన్నారు. ఆయన రాజకీయాల్లోకి వస్తే తమకు మద్దతు ఇస్తారని, ఎలాగైనా ఆయను కన్విన్స్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ ఇప్పుడేమో రజినీ అసలు రాజకీయాల్లోకి రానని అంటున్నారు. దీంతో ఆయన మనసు మారేలా మంతనాలు చేస్తున్నారు.
ఒకవేళ అక్కడ బీజేపీ ప్రయత్నాలు ఫలిస్తే ఫలించవచ్చేమో కానీ ఆంధ్రా, తెలంగాణల్లో మాత్రం అస్సలు పనిచేసే సూచనలు లేవు. ఇప్పటికే జనసేనను పక్కనపెట్టుకున్న బీజేపీ పవన్ సోదరుడు చిరంజీవికి వాలా వేసి ఉన్నారు. సోము వీర్రాజుగారు అధ్యక్షుడైన వెంటనే చిరు వద్దకు వెళ్లి అభినందనలు అందుకుని వచ్చారు. అప్పటినుండి చిరంజీవి బీజేపీలో చేరతారని, ఆయన ఎన్నికల సమయంలో పార్టీ కోసం స్టార్ క్యాంపైనర్ అవతారం ఎత్తుతారని ప్రచారం స్టార్ట్ చేశారు. అయితే అది జరగని పనే అనాలి. ఎందుకంటే ప్రస్తుతం చిరంజీవి రాజకీయాల్లోకి దిగే ఆలోచనలో లేరు.
ఆల్రెడీ ఒకసారి పార్టీ పెట్టి విఫలమైన ఆయన కొన్నేళ్లు సినీ పరిశ్రమకు కూడ దూరమై ఇప్పుడిప్పుడే సినిమాల్లో పడ్డారు. జనంలో తనమీదున్న నెగెటివిటీని తగ్గించుకుని పూర్వపు పరిస్థితిని తెచ్చుకోవడానికి కొత్త హీరోలా కష్టపడుతున్నారు. ఇలా కుదురుకుంటున్న తరుణంలో ఆయన గనుక మళ్ళీ పాలిటిక్స్, పార్టీలు అంటే మాత్రం జనం అస్సలు ఒప్పుకోరు. ఈ సంగతి చిరుకు కూడ తెలుసు. అందుకే గత ఎన్నికల్లో తమ్ముడు తరపున కూడ ప్రచారం చేయలేదు. ఇక తెలంగాణలో బీజేపీకి అనుకూలంగా కేసీఆర్ మీద యుద్దమంటే దుస్సాహసమనే అనాలి. కాబట్టి చిరు మాత్రం బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రచారం, మద్దతివ్వడం లాంటివి చేయకపోవచ్చని చెప్పొచ్ఛు.