ఆ విషయంలో చిరు, బాలయ్య సేమ్ టు సేమ్.. మెగాస్టార్ కు అదే ప్రాణమంటూ?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కెరీర్ తొలినాళ్లలో విలన్ పాత్రల్లో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించగా తర్వాత కాలంలో హీరోగా అంచెలంచెలుగా ఎదిగి కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు. కొన్నేళ్ల క్రితం వరకు మెగాస్టార్ చిరంజీవి సినిమా విడుదలైందంటే థియేటర్ల దగ్గర ఊహించని స్థాయిలో సందడి నెలకొనేది. ప్రస్తుతం పెద్ద సినిమాలు ఎక్కువ సంఖ్యలో థియేటర్లలో విడుదలవుతూ ఉండటంతో పరిస్థితి మారింది.

అభిమానులలో చాలామంది చిరంజీవిని ప్రేమగా చిరు అని పిలుచుకుంటారు. చిరంజీవి బీకాం డిగ్రీ చదివారు. చిరంజీవి తండ్రి కానిస్టేబుల్ కావడంతో పాటు చిన్నప్పటి నుంచి పిల్లలను ఎంతో క్రమశిక్షణతో పెంచారు. స్కూల్ డేస్ లోనే అద్దం ముందు నిలబడి కసితో చిరంజీవి నటించడం అలవాటు చేసుకున్నారు. ఖైదీ సినిమా సక్సెస్ తో చిరంజీవికి స్టార్ హీరోగా గుర్తింపు దక్కింది. పెళ్లైన తర్వాతే చిరంజీవికి అదృష్టం కలిసొచ్చింది.

స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ ఫేవరెట్ హీరో సీనియర్ ఎన్టీఆర్ అనే సంగతి తెలిసిందే. అయితే చిరంజీవి సినిమాల్లోకి రాకముందు ఆయన ఫేవరెట్ హీరో కూడా సీనియర్ ఎన్టీఆర్ కావడం గమనార్హం. ఆ విషయంలో చిరు, బాలయ్య సేమ్ టు సేమ్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవికి ఇష్టమైన వంటకం ఫిష్ ఫ్రై కాగా ఆయన ఫేవరెట్ హీరోయిన్ సావిత్రి కావడం గమనార్హం.

చిరంజీవికి 6 ఖరీదైన కార్లు ఉన్నాయని ప్రస్తుతం మెగాస్టార్ ఒక్కో సినిమాకు 30 కోట్ల రూపాయల నుంచి 40 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ను అందుకుంటున్నారని సమాచారం అందుతోంది. ప్రస్తుతం జూబ్లీహిల్స్ లో చిరంజీవి నివాసం ఉంటున్నారు. ప్రతిరోజూ తన సంపాదనలో లక్షల రూపాయలు చిరంజీవి ఖర్చు చేస్తున్నారు. అయితే ఆ విషయాలను ప్రచారం చేసుకోవడానికి చిరంజీవి ఇష్టపడరు.