ప్రస్తుతం ఏపీలో ఒకటే చర్చ. తిరుమల బ్రహ్మోత్సవాలకు వెళ్లిన సీఎం జగన్ వేషాదారణ గురించే చర్చ. ఆయన తిరునామాలు, పంచెకట్టు చూసి ఏపీ ప్రజలే ఆశ్చర్యపోయారు. శ్రీవేంకటేశ్వర స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమంత్రి పాల్గొన్న సమయంలో.. పంచెకట్టు, తిరునామంతో వెళ్లారు. ప్రభుత్వం తరుపున తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. దీనికి సంబంధించి వైఎస్ జగన్ ఫోటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అయితే.. బ్రహ్మోత్సవాల్లో వైఎస్ జగన్ ప్రవర్తించిన తీరుపై తాజాగా చిలుకూరు బాలాజీ గుడి ప్రధాన అర్చకులు ఎంవీ సౌందరరాజన్ స్పందించారు. సీఎం జగన్ ను చూస్తుంటే అచ్చం ఆయన తండ్రి వైఎస్సార్ ను చూసినట్టే ఉందన్నారు. వైఎస్ఆర్ చనిపోలేదని.. వైఎస్ జగన్ రూపంలో ఇంకా జీవించే ఉన్నారని సౌందరరాజన్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఆ వీడియోలో వైఎస్ జగన్ తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించడంపై మాట్లాడారు. వైఎస్సార్ ఇవాళ లేరు అని అనుకున్నాను కానీ ఆయన పోలేదు.. ఆయన ఉన్నారనేది ఇప్పుడు వైఎస్ జగన్ రూపంలో ప్రపంచం మొత్తం చూసింది. ప్రపంచ వ్యాప్తంగా మీకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మీరు తిరుమలలో గురువారం కూడా ఉంటున్నందుకు చాలా సంతోషం. ధార్మిక పరిషత్ అమలులోకి రావాలి.. దాని కోసం మీ సహకారం అవసరం..అంటూ ఆయన వీడియోలో పేర్కొన్నారు.