ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ప్రతిపక్షాలు ఎన్ని విధాలుగా ఇబ్బందులకు గురిచేసినా వాటిని ఎదుర్కుంటూ ముందుకు సాగిపోతున్నారు. ఏడాది కాలంగా జగన్ పై ప్రతిపక్షం చేయని ఆరోపణ లేదు…విమర్శలేదు. ఎప్పటికప్పుడు వాటిని తిప్పి కొడుతు జగన్ మంత్రి వర్గం ముందుకెళ్తోంది. పథకాల అమలు విషయంలో ఎక్కడా రాజీ పడకుండా అమలు చేస్తోంది. ఏడాది కాలంలోనే దాదాపు 80 శాతం మెనిఫెస్టో లో చెప్పిన పథకాలను అమలు పరిచిందింది. ఇంకా మెనిఫోస్టో లో లేని కొత్త పథకాలను తెరపైకి తీసుకొచ్చి అమలు చేసిన రికార్డు జగన్ సొంతం. పార్టీలకు అతీతంగా జగన్ సర్కార్ ముందుకు వెళ్తోంది.
ఆ విషయాన్ని జగన్ ప్రతీ పథకాన్ని అమలు చేసిన తర్వాత తూచ తప్పకుండా గుర్తు చేస్తున్నారు. ఇప్పటికే వైఎస్సార్ చేయూత పథకాన్ని అమలు చేసిన సంగతి తెలిసిందే. ఇక వచ్చే నాలుగేళ్లలో ఇవరై వేల కోట్ల రూపాయలు వెచ్చించనున్నారు. అలాగే 30 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు అందించనున్నారు. ఈ కార్యక్రమం ఇప్పటికే పూర్తి కావాల్సి ఉంది. కానీ పరిస్థితులు జగన్ మోహన్ రెడ్డికి కలిసి రావడం లేదు. న్యాయపరమైన ఇబ్బందులు ఎదురవ్వడంతో గాంధీ జయంతి రోజైన అక్టోబర్ 2న చేపట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే మూడున్నర కోట్ల మందికి వివిధ రూపాల్లో జగన పథకాలు అందుకున్నారు.
అలాగే ప్రాజెక్ట్ ల పరంగాను జగన్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. పోలవరం, పోతిరెడ్డి అంటూ మీడియా అటెన్షన్ ని డ్రా చేస్తున్నారు. పోతిరెడ్డి పాడు విషయంలో తెలంగాణ సర్కార్ తో ఢీ అంటే ఢీ అంటూనే ముందుకెళ్తోన్న సంగతి తెలిసిందే. ఇలా ఏడాదిగా జగన్ నిమ్మగడ్డ విషయంలో తప్ప ఎక్కడా రాజీ పడకుండా ముందుకువెళ్లారు. అయితే వీటిపై ప్రతిపక్షం ఎన్నో రకాలు గా బురద జల్లాలని చూసింది గానీ పనవ్వలేదు. తాజాగా ఏదీ కారణంగా లేక గ్రామాల్లో సీసీ రోడ్లు లేవని వాదన మొదలు పెట్టింది. మరి ఇప్పుడిలా గ్రామాల మీద ఎందుకు పడ్డారంటారు? ఎందుకంటే ! క్షేత్ర స్థాయిలో టీడీపీ పునాది రాళ్లకు ఎక్కడైనా బీటలు పడ్డాయేమోనన్న సందేహం రాక మానదు.