కట్నం ఇవ్వలేదని ఏకంగా అంతటి దారుణానికి ఒడిగట్టిన అత్తింటి వారు?

రోజు రోజుకి సమాజంలో వరకట్నపు వేధింపులు ఎక్కువ అవుతున్నాయి. మొదట పెళ్లి సమయంలో బాగానే ఉన్నప్పటికీ కొద్ది రోజులు గడిచిన తర్వాత అదనపు కట్నం తీసుకురావాలని మహిళలను చిత్రహింసలకు గురి చేస్తున్నారు. కొన్ని దేశాలలో అయితే వరకట్నం కోసం చివరికి చంపడానికి అయినా వెనకాడటం లేదు. ఇలాంటి దారుణమైన ఘటనలు సమాజంలో రోజు చూస్తున్నప్పటికీ కొంత మందిలో మార్పు రావడం లేదు. తాజాగా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఛత్తీస్ ఘడ్ లో వరకట్నం ఎక్కువగా ఇవ్వలేదు అన్న కారణంతో మహిళను 45 రోజుల పాటు బంధించి ఆ మహిళ భర్తతో పాటు, భర్త కుటుంబ సభ్యులు అందరూ ఆమెపై అత్యాచారం చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఈ దారుణమైన ఘటన చత్తీస్ ఘడ్ లో చోటుచేసుకుంది. నాలుగు చక్రాల వాహనం అదనపు కట్నం కింద ఇవ్వలేదని అత్తింటివారు అందరూ కలిసి 45 రోజులు పాటు ఒక మహిళను బంధించి అనంతరం ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. చత్తీస్ ఘడ్ లోని కుంట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితురాలు 181 మహిళ హెల్ప్ లైన్ రాయపూర్ ద్వారా నవంబర్ 18న పోలీసులకు ఫిర్యాదు లేఖను పంపింది. ఇందులో తన భర్తతో పాటు అతని కుటుంబ సభ్యులు వేధింపులకు పాల్పడుతున్నారని బాధితురాలు తెలిపింది. ఇక బాధితురాలిని కౌన్సిలింగ్ చేసే క్రమంలో నిందితులపై చెట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

ఇక బాధిత మహిళకు జనవరి 18, 2020 న అవదేశ్ సాహు కు, అమల్గి వాలే తో వివాహం జరిగింది. అయితే పెళ్లి సమయం ఆ బాధితురాలి తండ్రి తన సామర్ధ్యం మేరకు టీవీ,కూలర్,అల్మారా, అలాగే ఇంటికి సంబంధించిన గృహోపకరణాలను బహుమతిగా ఇచ్చాడు. ఈ మేరకు పెళ్లి అయిన రెండు మూడు రోజుల తర్వాత నుంచి అత్తింటి సభ్యులు భర్త అవదేశ్ సాహు, బావ ఓం ప్రకాష్ సాహు, అత్తగారు అనితా బాయి, బావ దోమన్ లు పెళ్లిలో కట్నం రాలేదని వేధించడం మొదలు పెట్టారు. అలా ఆ మహిళ ఒకసారి ఇంట్లో ఒంటరిగా ఉండడంతో ఆ మహిళ బావ బెదిరించి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత మార్చి 21 2020 నుండి 45 రోజులపాటు ఆమె మామ, భర్త, బావ, పెద్ద బావ అందరూ కలిసి ఆమె పై అత్యాచారం చేయడంతో పాటు చిత్రహింసలకు గురి చేశారు. బాధితులు పోలీసులకు ఇచ్చిన నివేదిక ఆధారంగా నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపారు. ఇందులో ఒక నిందితుడు పరారీలో ఉన్నాడని తెలిపారు.