Charan Becomes Ramudu : చరణ్ వాళ్లకి రాముడిలా కనిపిస్తున్నాడట.!

Charan Becomes Ramudu : దేశం మొత్తం ‘ఆర్ఆర్ఆర్’ ప్రభంజనం నడుస్తోంది. ఇండియన్ సినిమాగా ‘ఆర్ఆర్ఆర్’ కీర్తికెక్కుతోన్న సంగతి తెలిసిందే. కేవలం తెలుగు సినిమాలా కాకుండా, ఏ భాషలో రిలీజ్ అయితే, ఆ భాష వాళ్లు తమ సొంత సినిమాలా చూస్తున్నారు ‘ఆర్ఆర్ఆర్’ సినిమాని.

ఇక బాలీవుడ్ విషయానికి వస్తే, బాలీవుడ్ నటులు అజయ్ దేవగణ్, అలియా భట్ వంటి నటులున్నప్పటికీ ఈ సినిమాని వాళ్లు ఓన్ చేసుకున్న తీరు చూస్తే నిజంగా షాకవ్వాల్సిందే. జక్కన్న రాజమౌళికి బాలీవుడ్‌లో మంచి పేరుంది. ‘బాహుబలి’ సినిమాతో ఆ పేరు దక్కంచుకున్నాడు రాజమౌళి.

కానీ, ‘ఆర్ఆర్ఆర్’ విషయానికి వచ్చేసరికి, ఉత్తరాదిన చరణే రాజపోషకుడిగా కనిపిస్తున్నాడు. నిజానికి చరణ్‌కి బాలీవుడ్‌లో పెద్దగా క్రేజ్ లేదింతవరకూ. అలాంటిది ‘ఆర్ఆర్ఆర్’  సినిమాలో చరణ్ రాముడిలా కనిపిస్తున్నాడట. దాంతో చరణ్ వైపు నుంచి నార్త్ జనాలు బాగా ఓన్ చేసేసుకున్నారీ సినిమాని. అలా రాజమౌళి క్రేజ్‌తో కాకుండా, చరణ్ ఇమేజ్‌తో బాలీవుడ్‌లో ఊపేస్తోంది ‘ఆర్ఆర్ఆర్’ సినిమా.

జనం ఓన్ చేసుకుంటే ఓ సినిమా సక్సెస్ ఏ రేంజ్‌లో వుంటుందో గతంలో చాలా సినిమాల విషయంలో చూశాం. రీసెంట్‌గా రిలీజైన ‘ది కశ్మీర్ ఫైల్స్’ మూవీని కూడా నార్త్ జనాలు అలాగే ఓన్ చేసుకుని సక్సెస్ చేశారు. ఆ కోణంలో చూస్తే, బాలీవుడ్‌లో ‘ఆర్ఆర్ఆర్’ మోత మోగిపోవడం ఖాయం.