జబర్దస్త్ లో మార్పులు .. ఒంటరిగా షో ని ముందుకు నడిపించనున్న రష్మీ?

బుల్లితెర అందాల యాంకర్ జబర్దస్త్ బ్యూటీ రష్మి గురించి తెలియని వారంటూ ఉండరు. మొదట సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసిన రష్మి అక్కడ సరైన గుర్తింపు లభించకపోవడంతో బుల్లితెర మీద అడుగు పెట్టింది. ఈటీవీలో ప్రసారం అవుతున్న జబర్దస్త్ ద్వారా యాంకర్ గా బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. ఈ షోలో రష్మీ తన అందంతో పాటు వచ్చి రానీ తెలుగులో తన ముద్దు ముద్దు మాటలతో బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

అయితే ఇప్పుడు జబర్దస్త్ పరిస్థితి చాలా దారుణంగా మారిపోయింది. జబర్దస్త్ నుండి జడ్జెస్ తో పాటు పాపులర్ కమెడియన్లు కూడా బయటకు వెళ్లిపోయారు. ఇక ఇప్పుడు జబర్దస్త్ యాంకర్ అనసూయ కూడా జబర్దస్త్ కి దూరం కానుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్నో ఏళ్లుగా జబర్దస్త్ లో యాంకరింగ్ చేస్తు గ్లామరస్ యాంకర్ గా గుర్తింపు పొందిన అనసూయ ఇప్పుడు ఈ షో కి దూరం కానుంది. అయితే గతంలో కూడా ఒకసారి అనసూయ ఇలా జబర్దస్త్ కి దూరమయ్యింది. ఆ సమయంలో రష్మి యాంకర్ గా గుర్తింపు పొందింది. అయితే కొంతకాలానికి అనసూయ మళ్ళీ జబర్దస్త్ కి తిరిగి వచ్చింది. అయితే ఈ సారి మాత్రం అనసూయ తిరిగిరాదని సమాచారం.

అయితే ఇప్పుడు అనసూయ జబర్దస్త్ కి దూరం కావడంతో మళ్ళీ రష్మి ఒక్కతే జబర్దస్త్ , ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమాలకు యాంకరింగ్ చేస్తుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా అనసూయ స్థానంలో జబర్దస్త్ యాంకర్ గా మరొక ఫేమస్ యాంకర్ రాబోతోందని కూడా సమాచారం. అయితే ఈ వార్తలు గురించి ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోవడంతో మునుపటిలాగే ఈ కార్యక్రమాలను రష్మీ ముందుకు నడిపించబోతోంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే రష్మి శ్రీదేవి డ్రామా కంపెనీ షో లో కూడా సింగిల్ గా యాంకరింగ్ చేస్తోంది. ఇక ఇప్పుడు అనసూయ జబర్దస్త్ కి దూరమైతే రష్మి పాపులారిటీ మరింత పెరగటం ఖాయం అని అంటున్నారు.